Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ హీరోల‌ను ఇలా నిల‌దీసిన న‌టి!

తాజా ఇంట‌ర్వ్యూలో కాజోల్ చాలా కాలంగా ఆమోదించిన ఈ విధానంతో మ‌నం ఏం సందేశాన్ని పంపుతున్నాము? అని ప్ర‌వ్నించారు.

By:  Tupaki Desk   |   11 July 2025 7:59 PM IST
సీనియ‌ర్ హీరోల‌ను ఇలా నిల‌దీసిన న‌టి!
X

హీరో హీరోయిన్ మ‌ధ్య వయ‌సు గ్యాప్ గురించి చాలా కాలంగా సోష‌ల్ మీడియాల్లో డిబేట్లు న‌డుస్తూనే ఉన్నాయి. త‌మ కంటే 30-40 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న క‌థానాయిక‌ల‌ను హీరోలు త‌మ స‌ర‌స‌న‌ ఎంపిక చేయ‌డంపై చాలా విమ‌ర్శ‌లే ఉన్నాయి. ర‌జ‌నీకాంత్, చిరంజీవి, మోహ‌న్ బాబు, బాల‌కృష్ణ‌, వెంకీ, నాగార్జున‌.. వీళ్ల కంటే ముందు త‌రం స్టార్లు కూడా ఇదే ప‌ని చేసారు. ఏజ్ గ్యాప్ చాలా ఉన్నా, యువ న‌టీమ‌ణుల‌తో రొమాన్స్ చేయ‌డానికి వెన‌కాడ‌లేదు.

ఇటీవ‌లి కాలంలో స‌ల్మాన్ ఖాన్ `సికంద‌ర్` చిత్రంలో త‌న కంటే స‌గం వ‌య‌సు ఉన్న ర‌ష్మిక మంద‌న్న‌తో రొమాన్స్ చేసాడు. 60 ప్ల‌స్ ఖిలాడీ అక్ష‌య్ కుమార్ కేవ‌లం పాతిక ప్రాయం సారా అలీఖాన్ తో ఆడిపాడాడు. అయితే ఇలాంటి వాళ్లంద‌రినీ సీనియ‌ర్ న‌టి కాజోల్ సూటిగా ప్ర‌శ్నించారు.

తాజా ఇంట‌ర్వ్యూలో కాజోల్ చాలా కాలంగా ఆమోదించిన ఈ విధానంతో మ‌నం ఏం సందేశాన్ని పంపుతున్నాము? అని ప్ర‌వ్నించారు. ఇది చాలా కాలంగా ఉంది.. ఎవరూ దీనిని ప్రశ్నించలేదు.. అడగలేదు.. ఇలా ఎందుకు జరుగుతోంది? ఇంకా జరుగుతూనే ఉండాలా? అంటూ ప్ర‌శ్నించారు. దీని ద్వారా మ‌నం స‌మాజానికి ఎలాంటి సందేశాన్ని పంపుతున్నామని కూడా నిల‌దీసారు.