Begin typing your search above and press return to search.

12 ఏళ్ల తర్వాత... హిట్‌ కాంబో రిపీట్‌!

దాదాపు పదేళ్లుగా మురుగదాస్ ఒక పక్కా కమర్షియల్‌ సూపర్‌ హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.

By:  Tupaki Desk   |   1 April 2024 3:30 PM GMT
12 ఏళ్ల తర్వాత... హిట్‌ కాంబో రిపీట్‌!
X

తమిళ స్టార్‌ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌ ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద ఇతర దర్శకుల మాదిరిగా భారీ కమర్షియల్ బ్లాక్‌ బస్టర్‌ లను అందుకోవడంలో విఫలం అవుతున్నాడు. దాదాపు పదేళ్లుగా మురుగదాస్ ఒక పక్కా కమర్షియల్‌ సూపర్‌ హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.

ప్రస్తుతం శివ కార్తికేయన్‌ తో మురుగదాస్ ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్రను బాలీవుడ్‌ నటుడు విద్యుత్‌ జమ్వాల్‌ తో చేయించేందుకు సిద్ధం అయ్యాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ విషయమై అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ తమిళ మీడియా వర్గాల్లో ఈ విషయమై ప్రధానంగా చర్చ జరుగుతుంది.

12 ఏళ్ల క్రితం తుపాకీ సినిమాలో విద్యుత్‌ జమ్వాల్‌ ను దర్శకుడు మురుగదాస్ నటింపజేశాడు. విజయ్ హీరోగా నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విద్యుత్‌ జమ్వాల్‌ నటకు మరియు పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు హిట్‌ కాంబో రిపీట్ అవ్వబోతుంది.

మురుగదాస్ ఉన్న ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో తన సినిమాలోకి విద్యుత్‌ జమ్వాల్ ను తీసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ఆయన అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ సినిమా పై పాజిటివ్ టాక్‌ నడుస్తోంది.

శివ కార్తికేయ సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వక ముందే సల్మాన్‌ ఖాన్‌ తో మురుగదాస్ మూవీ ప్రకటన వచ్చింది. అతి త్వరలోనే సల్మాన్‌ తో హిందీ సినిమాను మురుగదాస్ ప్రారంభించే అవకాశం ఉంది. విద్యుత్‌ జమ్వాల్‌ సక్సెస్ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యి శివ కార్తికేయన్‌ మూవీ హిట్ అయితే మురుగదాస్ మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.