Begin typing your search above and press return to search.

33 ఏళ్ల తర్వాత దళపతి కాంబో రిపీట్.. ఫ్యాన్స్ ఖుషి..!

తమిళ సూపర్ స్టార్ రజినికాంత్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇద్దరు తమ వర్సటైల్ యాక్టింగ్ తో ఎన్నో దశాబ్ధాలుగా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 Nov 2023 3:30 PM GMT
33 ఏళ్ల తర్వాత దళపతి కాంబో రిపీట్.. ఫ్యాన్స్ ఖుషి..!
X

తమిళ సూపర్ స్టార్ రజినికాంత్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇద్దరు తమ వర్సటైల్ యాక్టింగ్ తో ఎన్నో దశాబ్ధాలుగా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. రజిని మమ్ముట్టి కలిసి 1991 లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి సినిమాలో నటించారు. ఆ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. ఇప్పటికి కూడా ఆ సినిమాలో కొన్ని సీన్స్ గురించి ప్రస్తావిస్తారు. ఇదిలా ఉంటే మరోసారి ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారని తెలుస్తుంది.

రీసెంట్ గా జైలర్ తో సూపర్ హిట్ అందుకుని బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో మరోసారి చూపించిన రజిని ప్రస్తుతం జై భీమ్ దర్శకుడు టీ.జే జ్ఞానవేల్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు.ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారని తెలిసిందే. రజిని 170వ సినిమాగా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమా తర్వాత రజిని 171వ సినిమా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో చేయనున్నారు.

ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి కూడా నటిస్తారని తెలుస్తుంది. దళపతి సినిమా తర్వాత మళ్లీ 33 ఏళ్ల గ్యాప్ తో రజిని, మమ్ముట్టి కలిసి పనిచేస్తున్నారు. కోలీవుడ్ లో ఈమధ్య క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు. జైలర్ లో రజిని తో పాటు మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ క్యామియోలు అదిరిపోయాయి. రజిని నెక్స్ట్ సినిమాలో కూడా అమితాబ్ ఉన్నాడు. సో ఇప్పుడు మమ్ముట్టితో రజిని స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఓ విధంగా ఈ కాంబినేషన్స్ కలవడం అభిమానులకు పండుగలా అనిపిస్తుందని చెప్పొచ్చు.

రజిని 171వ సినిమాలో రాఘవ లారెన్స్ విలన్ గా నటిస్తారని తెలుస్తుంది. సినిమాలో రజినిని ఢీ కొట్టే పాత్రలో లారెన్స్ కనిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత రజిని మమ్ముట్టి కలిసి స్క్రీన్ పంచుకోవడం ఆ ఇద్దరి హీరోలను అభిమానించే ప్రేక్షకులకు ఫుల్ జోష్ అందిస్తుంది. జైలర్ తో సత్తా చాటిన రజిని రాబోయే సినిమాలతో కూడా అదరగొట్టనున్నారు. మమ్ముట్టి కూడా ఓ పక్క మలయాళంలో తన మార్క్ సినిమాలతో అలరిస్తూనే ఇతర భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. కంప్లీట్ యాక్టర్ గా మమ్ముట్టి ఇప్పటికే భారీ క్రేజ్ తెచ్చుకోగా మిగతా సౌత్ సినిమాల్లో నటిస్తూ ఆయన రేంజ్ మరింత పెంచుకుంటున్నారు. తెలుగులో అయితే అఖిల్ చివరి సినిమా ఏజెంట్ లో నటించారు మమ్ముట్టి.