Begin typing your search above and press return to search.

ఆ తర్వాత.. ఏ స్టార్ క్లీన్ హిట్ అందుకోలేదా?

కోవిడ్ తర్వాత ప్రభాస్ నటించిన రాదేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచాయి.

By:  Tupaki Desk   |   20 Jan 2024 3:45 AM GMT
ఆ తర్వాత.. ఏ స్టార్ క్లీన్ హిట్ అందుకోలేదా?
X

కరోనా మహమ్మారి సినిమా పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల షూటింగ్స్, రిలీజ్ లు లేక సినీ తారలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దానికి తోడు థియేటర్స్ కూడా క్లోజ్ చేయడంతో పాండమిక్ టైమ్ తర్వాత తెలుగు సినీ ఇండ్రస్ట్రీ బిజినెస్ పరంగాను ఎన్నో మార్పులు చూసింది. నిజానికి కోవిడ్ తర్వాత తెలుగులో అగ్ర హీరోలు నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అయిన దాఖలాలు లేవు. పోస్ట్ కోవిడ్ టైమ్ లో స్టార్ హీరోల నుంచి వచ్చిన సినిమాలను పరిశీలిస్తే..

కోవిడ్ తర్వాత ప్రభాస్ నటించిన రాదేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచాయి. ఇక గత ఏడాది చివర్లో వచ్చిన 'సలార్' కేవలం నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించగా.. ఆంధ్ర తో పాటూ ఇతర ప్రాంతాల్లో నష్టాలను మిగిల్చింది. అసలు ప్రభాస్ బాహుబలి అనంతరం ఏ సినిమాతోను పర్ఫెక్ట్ గా బ్రేక్ ఈవెన్ సాధించలేదు.

పరశురాం దర్శకత్వంలో మహేష్ నటించిన 'సర్కారు వారి పాట' కేవలం కొన్ని ఏరియాలోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం కూడా సేమ్ రిజల్ట్ ని అందుకునే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప : ది రైజ్' ఇతర భాషల్లో భారీ కలెక్షన్స్ అందుకున్నప్పటికీ తెలుగు కి వచ్చేసరికి బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది.

రామ్ చరణ్ - ఎన్టీఆర్ కెరీర్ లో గ్లోబల్ బ్లాక్ బస్టర్ అయిన 'RRR' సైతం కొంతమంది ఆంధ్ర బయ్యర్స్ కి నష్టాలని మిగిల్చింది. టిక్కెట్ల రేట్లు కూడా అందుకు ఒక కారణం. ఆ తర్వాత తన తండ్రితో రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే..కరోనా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రెండు సినిమాలు బయ్యర్స్ కి కొంత నష్టాలను తెచ్చిపెట్టాయి. ఓపెనింగ్స్ బాగానే వచ్చినా కొన్ని ఏరియాల్లో పవన్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేయడం లేదు

ఆ తర్వాత వచ్చిన 'బ్రో' కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. మొత్తం మీద కోవిడ్ తర్వాత స్టార్ హీరోలు నటించిన సినిమాలు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ బ్లాక్ బస్టర్స్ అవడంలో విఫలమవుతున్నాయి. పెద్ద సినిమాలన్నింటికీ భారీగా బిజినెస్ జరగడం కూడా ఇందుకు ఒక కారణమని చెప్పొచ్చు.