Begin typing your search above and press return to search.

రెస్పెక్ట్ ఇవ్వ‌లేద‌ని ఆ ప‌ని చేసిన హీరో!

కానీ మ‌ల‌య‌ళం స్టార్ ఉన్ని ముకుంద‌న్..హీరోయిన్ మ‌హిమా నంబియార్ మ‌ధ్య మాత్రం అలాంటి ప్రెండ్ షిప్ లేద‌ని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   11 April 2024 2:45 AM GMT
రెస్పెక్ట్ ఇవ్వ‌లేద‌ని ఆ ప‌ని చేసిన హీరో!
X

ఒకే సినిమాలో హీరో-హీరోయిన్ క‌లిసి ప‌నిచేస్తే త‌ర్వాత స్నేహితులుగా మార‌డానికి అవ‌కాశం ఉంటుంది. క‌ల‌సి ప‌దే ప‌దే ప‌నిచేస్తే అందుకు ఆస్కారం ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. ఒక సినిమాలో నటించినా ఎదుట‌ప‌డితే క‌నీసం హాయ్ అనుకునే ప‌రిచ‌య‌మైన బిల్డ్ అవుతుంది. కానీ మ‌ల‌య‌ళం స్టార్ ఉన్ని ముకుంద‌న్..హీరోయిన్ మ‌హిమా నంబియార్ మ‌ధ్య మాత్రం అలాంటి ప్రెండ్ షిప్ లేద‌ని తెలుస్తోంది. ఇద్ద‌రు తొలిసార్ `మాస్ట‌ర్ పీస్` అనే సినిమాలో న‌టించారు. ప్ర‌స్తుతం `జై గ‌ణేష్` అనే మ‌రో చిత్రంలోనూ న‌టిస్తున్నారు.


మ‌రి ఇలా రెండు సినిమాలు క‌లిసి ప‌నిచేసిన‌ప్పుడు స్నేహం లేక‌పోవ‌డం ఏంటి? అంటారా? అంటే అందుకు హీరోయిన్ త‌ల‌బిరుసు త‌నమ‌ని ప్ర‌చారం సాగుతోంది. హీరోయిన్ అహంకారి అని భావించి ఉన్ని ముకుంద‌న్ ఆమె ఫోన్ నెంబ‌ర్ ని కూడా బ్లాక్ చేసాడుట‌. ఈ విష‌యం స్వ‌యంగా మ‌హిమా నంబియార్ తెలిపింది. ఉన్ని ముకుంద‌న్ నెంబ‌ర్ కోసం స్టోరీ రైట‌ర్ ఉద‌య్ కృష్ణ‌కి కాల్ చేసాను. అనంత‌రం ఉన్ని ముకుంద‌న్ కి వాట్సాప్ లో వాయిస్ మెసెజ్ పెట్టాను. నేను మ‌హిమ‌ని నీకు నేను ఎవ‌రో తెల‌స‌ని అనుకుంటున్నా అన్నా.

ఉద‌య్ నీ నంబ‌ర్ ఇచ్చాడ‌ని ఉద‌య్ అని రెండుసార్లు అన్నాను. దీంతో ఆ వాయిస్ విని ఉన్ని నా నెంబ‌ర్ బ్లాక్ చేసాడు. అలా ఎందుకు చేసాడో నాక‌ర్దం కాలేదు. ఆ త‌ర్వాత ఉద‌య్ కి ఉన్ని ఫోన్ చేసాడు. ఆమె అహంకారి. పేరుపెట్టి పిలుస్తుంది ఏంటి? సీనియ‌ర్ తో ఇలాగే న‌డుచుకుంటుందా? అన్నారుట‌. ఆ కార‌ణంగా ఏడేళ్లుగా బ్లాక్ లిస్ట్ లో పెట్టిన‌ట్లు చెప్పింది. అయితే ఆ స‌మ‌యంలో కేవ‌లం కోపంతోనే అలా చేసాన‌ని ఉన్నిముకుంద‌న్ వివ‌ర‌ణ ఇచ్చాడు.

ఆ తర్వాత బ్లాక్ చేసాను అన్న సంగ‌తి మ‌ర్చిపోవ‌డంతోనే కాంటాక్ట లేకుండా పోయింది. త‌ర్వాత ఓ సినిమాతో హిట్ కొట్టిన‌ప్పుడు..ర‌జింత్ శంక‌ర్ సినిమాలో న‌టిస్తుంద‌న్న విష‌యం తెలియ‌డంతో బ్లాక్ చేసిన సంగ‌తి గుర్తొచ్చింది. వెంట‌నే అన్ బ్లాక్ చేసి మెసేజ్ చేసాను` అని ఉన్ని ముకుంద‌న్ వివ‌ర‌ణ ఇచ్చాడు. ఈ జోడీ మ‌ళ్లీ ఏడేళ్ల త‌ర్వాత క‌లిసి సినిమా చేస్తుండ‌టం విశేషం.