Begin typing your search above and press return to search.

డ్యాన్సులు కుమ్ముడే.. ఆఫ్రికా చిన్నారుల్లో 'కావాలా' ఫీవ‌ర్

ఇదిలా ఉండ‌గా.. ఉగాండా(ఆఫ్రికా)లోని కంపాలా వీధుల్లోని స్కూల్ చిన్నారుల (డ్యాన్సింగ్ కిడ్స్‌) బృందం 'జైలర్' ఫీవ‌ర్ తో ఊగిపోతోంది.

By:  Tupaki Desk   |   28 Aug 2023 4:58 PM GMT
డ్యాన్సులు కుమ్ముడే.. ఆఫ్రికా చిన్నారుల్లో కావాలా ఫీవ‌ర్
X

బార్సిలోనాకు జైలర్ ఫీవ‌ర్ ప‌ట్టుకుంది! అక్క‌డ స్కూల్ పిల్ల‌ల్లో వెర్రి వింత‌గా మారింది. పిల్ల‌లంతా ఎన‌ర్జీతో ఉర్రూత‌లూగించారు. డ్యాన్సుల‌తో హీటెక్కించారు. రజనీకాంత్ జైలర్ నుంచి కావాలా అంత‌గా న‌చ్చింది. ఇప్ప‌టికే జైల‌ర్ 500 కోట్ల క్ల‌బ్‌తో ర‌జ‌నీ కెరీర్ లో మ‌రో మైలురాయి చిత్రంగా మారింది. ఈ సినిమా పాట‌లు కూడా అభిమానులలోకి వైర‌ల్ గా దూసుకెళ్లాయి. ఇప్ప‌టికే త‌మ‌న్నా 'కావాలా..' సాంగ్ వెబ్ లో యూట్యూబ్ లో సంచ‌ల‌నంగా మారింది. ఈ పాట‌కు అనుక‌ర‌ణ స్టెప్పుల‌తో యువ‌త‌రం అద‌ర‌గొడుతున్నారు.

ఇదిలా ఉండ‌గా.. ఉగాండా(ఆఫ్రికా)లోని కంపాలా వీధుల్లోని స్కూల్ చిన్నారుల (డ్యాన్సింగ్ కిడ్స్‌) బృందం 'జైలర్' ఫీవ‌ర్ తో ఊగిపోతోంది. ఈ చిత్రంలోని 'కావాలా..' పాటకు అదిరిపోయే నృత్యం చేసారు ఉగాండా కిడ్స్‌. స్పానిష్ క్లబ్ - FC Barcelona ఈ వీడియోను షేర్ చేయ‌డంతో ఇది ఇప్పుడు ఇండియాలోను వైర‌ల్ గా మారింది.

త‌మ దేశ జెర్సీలు ధ‌రించిన యువ డ్యాన్స్ గ్రూప్ అదిరిపోయే నృత్యాల‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో క్ష‌ణాల్లో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ బృందాన్ని 'హైపర్స్ కిడ్స్ ఆఫ్రికా' అని పిలుస్తున్నారు. చార్ట్ బ‌స్ట‌ర్ 'కావాలా...' సాంగ్ కి దేశ విదేశాల్లో గొప్ప వీరాభిమానులున్నార‌ని ఇప్పుడు మ‌రోసారి ప్రూవైంది. తాజా వైరల్ వీడియోలో ఈ చిన్నారుల‌ సమూహం FC బార్సిలోనా జెర్సీలను ధరించి డ్యాన్సులు చేయ‌డం విశేషం.

కావాలా .. సాంగ్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి ఈ పాట‌ను ఉపయోగించి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను క్రియేట్ చేస్తున్నారు నెటిజనం. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన పాట‌. త‌మ‌న్నా డ్యాన్సులు కిల్లింగ్ మూవ్స్ యూత్ కి టీనేజ‌ర్ల‌కు పిచ్చిగా క‌నెక్ట‌యిపోయాయి. ఇక సూప‌ర్ స్టార్ రజనీకాంత్ తాను ఎందుకు గ్లోబల్ సూపర్ స్టార్ అనేది మరోసారి నిరూపించారు. FC బార్సిలోనా అధికారిక X ఖాతా ట్వీట్ చేయడంతో 'హైపర్స్ కిడ్స్ ఆఫ్రికా' శక్తి ఎలాంటిదో ప్ర‌పంచానికి తెలిసొచ్చింది. స్పానిష్ క్లబ్ ఈ వీడియోని షేర్ చేసి ప్రశంసించింది.