Begin typing your search above and press return to search.

పృథ్వీరాజ్ క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం

మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఓ వైపు హీరోగా, మ‌రోవైపు న‌టుడిగా, ఇంకోవైపు డైరెక్ట‌ర్ గా ప‌లువిధాలుగా త‌న స‌త్తా చాటుతూ త‌న‌దైన ముద్ర వేసుకుంటూ ఆడియ‌న్స్ ను అల‌రిస్తూ వ‌స్తున్నాడు.

By:  Tupaki Desk   |   17 April 2025 4:56 PM IST
Aadu Jeevitham Wins 9 Kerala State Film Awards
X

మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఓ వైపు హీరోగా, మ‌రోవైపు న‌టుడిగా, ఇంకోవైపు డైరెక్ట‌ర్ గా ప‌లువిధాలుగా త‌న స‌త్తా చాటుతూ త‌న‌దైన ముద్ర వేసుకుంటూ ఆడియ‌న్స్ ను అల‌రిస్తూ వ‌స్తున్నాడు. రీసెంట్ గా ఎల్‌2 ఎంపురాన్ తో మంచి స‌క్సెస్ అందుకున్న పృథ్వీరాజ్ సుకుమార‌న్ దాని కంటే ముందే ఆడు జీవితం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

బ్లెస్సీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆడు జీవితం సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, అమ‌లాపాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సౌదీలో కూలీలు ప‌డే క‌ష్టాల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా గ‌తేడాది మార్చి 28న థియేట‌ర్ల‌లో రిలీజై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకుంది. రూ. 150 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించి మ‌ల‌యాళంలో ఎక్కువ వ‌సూలు చేసిన సినిమాల లిస్టు లో చేరింది ఈ సినిమా.

ఆడు జీవితం సినిమా కోసం పృథ్వీరాజ్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డాడు. ఆ క‌ష్టం స్క్రీన్ పై ప్ర‌తీ ఫ్రేమ్ లోనూ క‌నిపించింది. అయితే పృథ్వీరాజ్ క‌ష్టాన్ని కేర‌ళ ప్ర‌భుత్వం గుర్తించింది. బుధ‌వారం కేర‌ళ‌లో రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర అవార్డుల కార్య‌క్ర‌మం జ‌ర‌గ్గా ఆ కార్య‌క్ర‌మానికి కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌యన్ చీఫ్ గెస్టుగా హాజ‌ర‌య్యారు. కేర‌ళ స్టేట్ ఫిల్మ్ అవార్డుల్లో ఆడు జీవితం సినిమాకు ఏకంగా 9 అవార్డులొచ్చాయి.

ఏయే విభాగాల్లో ఆడు జీవితం సినిమాకు అవార్డులొచ్చాయంటే..

ఉత్త‌మ న‌టుడిగా పృథ్వీ రాజ్ సుకుమార‌న్

ఉత్త‌మ న‌టిగా ఊర్వ‌శి

ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా బ్లెస్సీ

బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్ గా విజ‌య రాఘ‌వ‌న్

ఉత్త‌మ ప‌రిచ‌య ద‌ర్శ‌కుడిగా ఫాజిల్ ర‌స‌క్

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా ఫెమినా జ‌బ్బ‌ర్

బెస్ట్ మేక‌ప్ ఆర్టిస్ట్ గా రంజిత్ అంబాడి తో పాటూ బెస్ట్ ఎంట‌ర్టైనింగ్ ఫిల్మ్ గా, బెస్ట్ క‌ల‌రిస్ట్ విభాగాల్లో కూడా ఆడు జీవితం సినిమాకు అవార్డులొచ్చాయి. మొత్తానికి ఆడు జీవితం సినిమా కోసం చిత్ర యూనిట్ ప‌డిన క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం అవార్డుల రూపంలో ఇలా ద‌క్కింద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ ప‌డుతూ టీమ్ కు కంగ్రాట్స్ చెప్తున్నారు.