Begin typing your search above and press return to search.

'అదృశ్య జలకంగల్'.. మరణించిన వారితో కమ్యూనికేట్

'అదృశ్య జలకంగల్'తో సరికొత్తగా ఎట్రాక్ట్ చేసేందుకు రెడి అవుతున్నాడు. ఇక ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   9 Nov 2023 4:40 AM GMT
అదృశ్య జలకంగల్.. మరణించిన వారితో కమ్యూనికేట్
X

మలయాళం నటుడు టోవినో థామస్ ప్రతీ సినిమాలో ఏదో ఒక కొత్త తరహా కంటెంట్ తో మెప్పిస్తూనే ఉన్నాడు. '2018' సినిమాతో బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ చూసిన ఈ నటుడు ఇప్పుడు 'అదృశ్య జలకంగల్'తో సరికొత్తగా ఎట్రాక్ట్ చేసేందుకు రెడి అవుతున్నాడు. ఇక ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.


స్కిన్డ్ క్యారెక్టర్, అతీంద్రియ అంశాల ద్వారా అల్లిన కథనంలో అద్భుతమైన ఏమోషన్స్ ను హైలెట్ చేస్తున్నారు. టోవినో థామస్ పూర్తిగా కొత్త కోణంలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ట్రైలర్ ఆకట్టుకుంది. మరణించిన వారితో కమ్యూనికేట్ చేయగల ప్రత్యేక సామర్థ్యం ఉన్న ఆ పాత్ర ఒకవైపు కామెడీగానే కాకుండా మరోవైపు వెన్నులో వణుకు పుట్టిస్తుంది.

అలాగే రాబోయే యుద్ధాన్ని అతని శక్తితో ఎలా అడ్డుకున్నాడు? అసలు వచ్చిన సమస్య ఏమిటి అనే అంశాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే అతని ప్రేయసి చుట్టూ ఒక ఏమోషన్ కూడా హైలెట్ అవుతోంది. 'అదృశ్య జలకంగల్' సినిమా రెగ్యులర్ సినిమా లకంటే భిన్నమైన కంటెంట్ తో రానుందని ట్రైలర్‌ చూస్తుంటే స్పష్టమవుతోంది. నటీనటులు వారి పాత్రలకు తగ్గట్టుగా లీనమై నటించారని అనిపిస్తుంది.

ఈ సినిమాకు డాక్టర్ బిజుకుమార్ దామోధరన్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు టోవినో థామస్ ప్రొడక్షన్స్ సినిమాను నిర్మించారు. ‘అదృశ్య జలకంగల్’ లో నిమిషా సజయన్ మరియు ఇంద్రన్స్‌తో సహా మరికొందరు ప్రముఖ నటులు ముఖ్యమైన పాత్రలలో నటించారు. పాటలు ఒరిజినల్ స్కోర్ పరంగా సినిమాకు రికీ కేజ్ మరో బలం అని చెప్పవచ్చు.

ఈ అంశాలన్నీ 'అదృశ్య జలకంగల్' రేంజ్ ను పెంచుతున్నాయి. ఇక నవంబర్ 24న ఈ సినిమాను థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. 'అదృశ్య జలకంగల్' సినిమాలో ఇంట్రెస్టింగ్ కథాంశం, అసాధారణమైన నటన అతీంద్రియ శక్తి, యుద్ధ-నాశనమైన వాస్తవాలు హైలెట్ కాబోతున్నాయి. మరి ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.