230 కేజీల బరువున్న గాయకుడి మరణంలో ట్విస్టు!
మ్యూజిక్ డైరెక్టర్ గా, గాయకుడిగా కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్న అద్నాన్ సమీ, అధిక బరువుతో చనిపోతాడనే హెచ్చరికలు వెలువడ్డాయి.
By: Tupaki Desk | 7 Jun 2025 9:29 AM ISTనువ్వు పోతావురో కొడుకో ఈ బరువు తగ్గకపోతే! అని ఏ తండ్రి అయినా కన్నీళ్లు పెట్టుకున్నాడు! అంటే దానికి ఆ హెవీ వెయిట్ కొడుకు సమాధానమివ్వాలి కదా? 230 కేజీల బరువున్న ప్రముఖ పాకిస్తానీ గాయకుడు తన తండ్రి కలతను గమనించకుండా లైట్ తీస్కుని ఉంటే ఏమయ్యేవాడో తెలుసా?
అసలు ఈ గాయకుడి జీవితంలో అలాంటి ఒక ఎమోషనల్ ఘట్టం లేకపోయి ఉంటే ఏమయ్యేవాడో! ఈ రోజు అద్నాన్ సమీ ఒక బాలీవుడ్ హీరోలా ఇస్మార్ట్ గా మెరుస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ రామ్ లా ఎనర్టిటిగ్గా ఉన్నాడు! అంటే దానికి కారణం అతడిలోని పట్టుదల.. కఠోరమైన ధీక్ష.
మ్యూజిక్ డైరెక్టర్ గా, గాయకుడిగా కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్న అద్నాన్ సమీ, అధిక బరువుతో చనిపోతాడనే హెచ్చరికలు వెలువడ్డాయి. అతడు అధిక కొవ్వు కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యలతో చాలా బాధపడ్డాడు. 230 కిలోల బరువున్న ఈ ప్రసిద్ధ గాయకుడు ప్రమాదంలో ఉన్నాడు.. కానీ తన తండ్రితో చాలా భావోద్వేగ సంభాషణ తర్వాత వాస్తవం ఏమిటో అర్థం చేసుకున్నాడు. ఆరోజు ఆ ఎమోషనల్ ఘట్టం అతడి జీవితంలో లేకపోయి ఉంటే? అసలు తన పరిస్థితి ఏమిటో కూడా తనకు అర్థమయ్యేది కాదు!
ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అద్నాన్ తన గతం గురించి గుర్తు చేసుకున్నాడు. తన బరువు ఇంత అద్భుతంగా మారడానికి కారణాలను తెలిపాడు. ఒకవేళ మీరు బరువు తగ్గకపోతే ఏ హోటల్ గదిలోనో ఆర్నెళ్ల తర్వాత చనిపోయి ఉంటావు! అని వైద్యుడు తన తల్లిదండ్రుల ముందే హెచ్చరించాడు. దీనికి అతడి తల్లిదండ్రులు చాలా కలతకు గురయ్యారు. కానీ అతడు మాత్రం కోపంగా వైద్యుడిని ధిక్కరించి నేరుగా బేకరీకి వెళ్లి కేజీల కొద్దీ కేసులు, బన్నులు తిన్నాడు. అయితే తన తండ్రి తనతో ఎమోషనల్ గా కోపంగా మాట్టాడారు.
నేను నిన్ను ఒకే ఒక్క విషయం అడుగుతున్నాను.. దయచేసి నా బిడ్డను నా చేతులతో పాతిపెట్టనివ్వకు. నువ్వు నన్ను పాతిపెట్టాలి.. దానికి విరుద్ధంగా జరగకూడదు! అని అద్నాన్ సమీ తండ్రి కన్నీటిపర్యంతం అయ్యారు. ఆ తర్వాత బరువు తగ్గుతానని వాగ్దానం చేసిన అద్నాన్ 120 కిలోలు తగ్గాడు.
