పాకిస్తాన్‌పై పాక్ గాయకుడి ఏహ్యభావం?
ఉగ్ర కుట్రల పాకిస్తాన్ ని తన దేశం అని చెప్పుకునేందుకు కూడా ఈ పాక్ గాయకుడు సిద్ధంగా లేడు.
By: Tupaki Desk | 22 Jun 2025 9:15 AM ISTఉగ్ర కుట్రల పాకిస్తాన్ ని తన దేశం అని చెప్పుకునేందుకు కూడా ఈ పాక్ గాయకుడు సిద్ధంగా లేడు. అతడు పాకిస్తాన్ ని తన మాజీ ప్రేయసి అని అన్నాడు. ఈ మాట అన్నది మరెవరో కాదు.. పాకిస్తానీ గాయకుడు అద్నాన్ సమీ. బాలీవుడ్, టాలీవుడ్ సహా భారతీయ సినీపరిశ్రమలన్నిటికీ అతడు సుపరిచితుడు.
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన `శంకర్ దాదా ఎంబీబీఎస్` చిత్రంలో `ఏ జిల్లా ఏ జిల్లా...` అనే చార్ట్ బస్టర్ పాటను కూడా పాడాడు. అద్నాన్ తర్వాత తెలుగులో కొన్ని హిట్ నంబర్లు పాడాడు. బాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన క్లాసిక్ పాటలను కూడా ఆలపించాడు. యువతరం ఉర్రూతలూగేంతగా అతడు తన గానంతో మైమరిపించాడు.
కళకు దేశం, ప్రాంతం, కులం మతం ఎప్పుడూ అడ్డు కాదని నిరూపించిన ప్రముఖుడు అద్నాన్ సమీ. ఇప్పుడు అతడు పాకిస్తాన్ పై ఏహ్యభావం కలిగి ఉన్నాడు. అతడు పూర్తిగా భారతీయ పౌరసత్వం తీసుకుని ఇక్కడే సెటిలయ్యాడు. అందుకే పాక్ ని మాజీ ప్రేయసి అని అన్నాడు. 2016 నుంచి భారతీయ పౌరుడిగా ఉన్నాడు గనుక అతడు ఇక్కడ చాలా సురక్షితంగా ఉన్నాడు. ఇటీవలే అద్నాన్ నుంచి `ఆవో నా` అనే కొత్త పాట విడుదలై ఆదరణ దక్కించుకుంటోంది.
