Begin typing your search above and press return to search.

హీరోయిన్ల‌తో హిట్ మ్యాన్ రొమాన్స్!

తాజాగా యంగ్ హీరో ‘లవ్ స్టోరీ’లో షాట్ ఇవ్వాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఓ ల‌వ్ స్టోరీలో న‌టిస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు.

By:  Tupaki Desk   |   25 Sep 2023 7:19 AM GMT
హీరోయిన్ల‌తో హిట్ మ్యాన్  రొమాన్స్!
X

యంగ్ హీరో అడ‌వి శేష్ అంటే ఇప్పుడ‌న్నీ థ్రిల్ల‌ర్ ..యాక్ష‌న్ సినిమాలే గుర్తొస్తాయి. ఆయ‌న్ని మ‌రో సినిమాలో ఊహించుకోవ‌డం కూడా క‌ష్టం అన్నంత‌గా ప్రేక్ష‌కుల్ని ఆ జోన్ లోకి నెట్టేసాడు. 'క్ష‌ణం'.. 'గుఢచారి'.. 'హిట్'..'మేజ‌ర్' లాంటి సినిమాలు వ‌రుస‌గా భారీ విజ‌యాలు సాధించ‌డంతో! శేష్ ఏ సినిమా చేసినా అలాంటి వైవిథ్యం ఉండాల‌ని కోరుకుంటున్నారు. కొంత‌మంది హీరోలు కొన్ని ర‌కాల క‌థ‌ల‌కే అర్హులు.


అవి చేస్తేనే బాగుంటుంద‌ని సూపర్ స్టార్ మహేష్ సైతం చెప్పిన మాట గుర్తుకొస్తుంది. శేష్ విష‌యంలో మ‌హేష్ ఈ మాటే చెప్పారు. అయితే శేష్ మాత్రం అలాంటి చిత్రాల నుంచి కాస్త ఛేంజోవ‌ర్ కోరుకుంటు న్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా యంగ్ హీరో ‘లవ్ స్టోరీ’లో షాట్ ఇవ్వాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఓ ల‌వ్ స్టోరీలో న‌టిస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు.

ఆ పాత్ర‌కి సంబంధించి లుక్ టెస్ట్ కూడా పూర్తిచేసాడు. నవంబర్ - డిసెంబర్‌లో ప్రాజెక్ట్ పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్నాయ‌ని తెలిపారు. ఈ సినిమాతో పాటే ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం గుఢ‌చారి -2 కూడా ప్రారంభం అవుతుందని అన్నారు. ఒకేసారి రెండు సినిమాలు పూర్తి చేయాల్సిన బాధ్య‌త‌లున్నాయ‌ని ప్ర‌క‌టించాడు. దీంతో యంగ్ హీరో సినిమాల స్పీడ్ పెంచిన‌ట్లు క‌నిపిస్తుంది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఒక సినిమా కోసమే ఎక్కువ స‌మ‌యం కేటాయించేవారు. పూర్త‌య్యే వ‌ర‌కూ మ‌రో ప్రాజెక్ట్ లో త‌ల పెట్టే వారు కాదు. కానీ అలా చేస్తే ఏడాదికి ఒక సినిమానే ఇవ్వ‌గ‌లం అని అనుక‌న్నాడో! ఏమో తాజాగా ప్లానింగ్ మొత్తం మార్చిన‌ట్లు తెలుస్తోంది. ఇక ల‌వ్ స్టోరీలు శేష్ కి కొత్తేం కాదు. గ‌తంలో చేతన్ భగత్ నవల ఆధారంగా తెర‌కెక్కిన బాలీవుడ్ హిట్ సినిమా '2 స్టేట్స్' ని రీమేక్ చేయాల‌ని ప్ర‌య‌త్నించారు.

అందులో శేషుకి జోడీగా రాజశేఖర్-జీవిత కుమార్తె శివాని తీసుకున్నారు. కానీ దర్శకుడి తో క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ రావ‌డంతో మ‌ధ్య‌లోనే ఆ ప్రాజెక్ట్ ఆపేసారు. ఆ త‌ర్వాత ల‌వ్ స్టోరీలు విన‌లేదు. ఇంత కాలానికి మ‌రోసారి ల‌వ్ స్టోరీతో మెప్పించ‌డానికి రెడీ అవుతున్నాడు.