Begin typing your search above and press return to search.

ఐఎండీబీ 250 చిత్రాల్లో క్ష‌ణం..ఎవ‌రు..మేజ‌ర్!

అంత‌కు ముందు ద‌శాబ్ధం నుంచి ఇండ‌స్ట్రీలో ఉండి పోరాటం చేస్తున్నా? ఏ సినిమా తీసుకురాని గుర్తింపుని `క్ష‌ణం` తీసుకొచ్చింది.

By:  Tupaki Desk   |   23 Dec 2023 12:29 PM GMT
ఐఎండీబీ 250 చిత్రాల్లో క్ష‌ణం..ఎవ‌రు..మేజ‌ర్!
X

యంగ్ హీరో అడ‌వి శేష్ కెరీర్ ని మార్చిన చిత్రాలంటే? 'క్షణం`.. 'గుఢ‌చారి`..'ఎవ‌రు`..'మేజ‌ర్` చిత్రాలే గుర్తొస్తాయి. న‌టుడిగా శేషు కి ఆ నాలుగు సినిమాలు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని తీసుకొచ్చాయి. అప్ప‌టి వ‌ర‌కూ శేష్ వేరు..అప్ప‌టి నుంచి లెక్క వేరు అనిపించిన స‌క్సెస్ లు అవి. అంత‌కు ముందు ద‌శాబ్ధం నుంచి ఇండ‌స్ట్రీలో ఉండి పోరాటం చేస్తున్నా? ఏ సినిమా తీసుకురాని గుర్తింపుని 'క్ష‌ణం` తీసుకొచ్చింది.


ఆ సినిమాతో అత‌నిలో రైటింగ్స్ స్కిల్స్ బ‌య‌ట ప‌డ్డాయి. న‌టుడిగా కంటే ముందు అత‌ను గొప్ప రైట‌ర్ అని ఆ సినిమాతో ప్రూవ్ అయింది. కెరీర్ ఆరంభంలోనే `క‌ర్మ` లాంటి డిఫ‌రెంట్ అటెంప్ట్ చేసినా? అప్ప‌టి జ‌నాల‌కది ఎక్క‌లేదు. చాలా అడ్వాన్స్డ్ గా తీసిన చిత్ర‌మ‌ది. నేటి జ‌న‌రేష‌న్ యువ‌త‌కి క‌ర్మ ప‌క్కాగా క‌నెక్ట్ అయ్యేది? అదంతా గ‌తం. `మేజ‌ర్` సినిమాతో పాన్ ఇండియాలోనూ గుర్తింపు ద‌క్కింది.

ఇప్పుడు అవ‌కాశాల ప‌రంగా తిరుగులేదు. టాలీవుడ్ లో బిజీ న‌టుడయ్యాడు. బాలీవుడ్ లో సైతం అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అత‌నితో రైటింగ్స్ స్కిల్స్ మెచ్చి ఆ ర‌కంగానూ ప్రోత్స‌హించే నిర్మాతలెంతో మంది ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా `క్ష‌ణం`..`ఎవ‌రు`..`మేజ‌ర్` చిత్రాల‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ప్ర‌ఖ్యాత ఐఎండీబీ రేటింగ్ టాప్ 250 చిత్రాల్లో ఆ మూడు చిత్రాల‌కు స్థానం ద‌క్కింది.

అయితే ఏ సినిమా ఏ స్థానంలో నిలిచింది? వాటి ర్యాకింగ్స్ ఏంటి? అన్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. త‌మ ఘ‌న‌త‌ను గుర్తు చేసుకుంటూ ఆయా చిత్ర యూనిట్ లో సోష‌ల్ మీడియా వేదిక‌గా గ‌ర్వంగా ప్ర‌మోట్ చేస్తున్నారు. మ‌రి ఈ స్థానాల పట్ల అడ‌వి శేష్ ఎలా స్పందిస్తారు? అన్న‌ది చూడాలి.