Begin typing your search above and press return to search.

ఏడాది అంతా ఆ హీరో ఊరికే ఏమీ లేడట!

అడవి శేష్‌ హీరోగా సినిమా వచ్చి ఏడాది అవుతోంది. వరుసగా మేజర్ మరియు హిట్ 2 సినిమాలతో సక్సెస్ ను దక్కించుకున్న ఈ హీరో ఏడాది కాలంగా మరే సినిమాను విడుదల చేయలేదు.

By:  Tupaki Desk   |   13 Nov 2023 6:17 AM GMT
ఏడాది అంతా ఆ హీరో ఊరికే ఏమీ లేడట!
X

అడవి శేష్‌ హీరోగా సినిమా వచ్చి ఏడాది అవుతోంది. వరుసగా మేజర్ మరియు హిట్ 2 సినిమాలతో సక్సెస్ ను దక్కించుకున్న ఈ హీరో ఏడాది కాలంగా మరే సినిమాను విడుదల చేయలేదు. అంతే కాకుండా ఈ ఏడాది కాలంగా ఆయన ఏ సినిమా షూటింగ్‌ లో కూడా పాల్గొనలేదు. ఒక్క హిట్‌ వస్తే మూడు నాలుగు సినిమాలు కమిట్ అయ్యే హీరోలు టాలీవుడ్‌ లో ఉన్నారు.

అలాంటిది రెండు బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలు సొంతం చేసుకున్న అడవి శేష్‌ ఏడాది కాలంగా ఖాళీగా ఉండటం ఏంటి అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన ఓకే అనాలే కానీ ఈ ఏడాది కాలంలో భారీ పారితోషికం తో మూడు నాలుగు సినిమాలకు సైన్ చేసి, అందులో రెండు మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకు వచ్చేవాడు.

అడవి శేష్‌ కి అంత తొందర లేనట్లుంది. అందుకే ఆయన మెల్లగానే సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. గత ఏడాది కాలంగా ఆయన కొత్త సినిమాలు మొదలు పెట్టలేదు.. కానీ కొత్త సినిమాల పనిలో ఉన్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే గూఢచారి 2 సినిమాను శేష్ మొదలు పెట్టబోతున్నాడు.

ఏడాది కాలంగా లభించిన సమయం ను ఆ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ కోసం శేష్‌ ఉపయోగించుకున్నాడట. అద్భుతమైన స్క్రిప్ట్‌ ను రెడీ చేసుకుని రంగంలోకి దిగబోతున్నాడు. స్పై బ్యాక్ డ్రాప్‌ లో వచ్చిన సినిమాలు వస్తున్న సినిమాలు అంతగా అలరించడం లేదు. అందుకే శేష్ ఇంకాస్త ఎక్కువ హోం వర్క్‌ చేసి మరీ ఈ సినిమాను చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

గూఢచారి సినిమా తో పాటు ఒక క్యూట్‌ లవ్‌ స్టోరీ సినిమాను కూడా శేష్‌ చేయబోతున్నాడు. ఈ గ్యాప్‌ లో శేష్ ఆ లవ్ స్టోరీ స్క్రిప్ట్‌ పై కూడా దర్శకుడితో కలిసి వర్క్‌ చేశాడని తెలుస్తోంది. మొత్తానికి ఏడాది గ్యాప్‌ వచ్చినా కూడా వచ్చే ఏడాది రెండు మంచి సినిమాలు, హిట్ సినిమాలతో శేష్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.