Begin typing your search above and press return to search.

అడివి శేష్ అలర్ట్.. ధోని బొమ్మ చూపించి మరి..!

బఫరింగ్ సుఫర్ చేయొచ్చు. కానీ ఒక్కసారి లోడ్ అయితే మాత్రం ఎక్స్ ప్లోడ్ అవుతుంది #G2 లోడింగ్ అని పెట్టాడు అడివి శేష్.

By:  Tupaki Desk   |   5 April 2024 9:15 AM GMT
అడివి శేష్ అలర్ట్.. ధోని బొమ్మ చూపించి మరి..!
X

కొన్నిసార్లు రావడం లేట్ అవ్వొచ్చు కానీ రావడం మాత్రం పక్కా అని పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది కదా ఇప్పుడు దాన్ని మోడ్రనైజ్ చేస్తూ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ తన జీ 2 గురించి చిన్న హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం డెకాయిట్, గూడచారి 2 సినిమాల్లో నటిస్తున్న అడివి శేష్ ఆ సినిమాల అప్డేట్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారన్న విషయాన్ని గుర్తించాడు. అందుకే జి2 గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.

బఫరింగ్ సుఫర్ చేయొచ్చు. కానీ ఒక్కసారి లోడ్ అయితే మాత్రం ఎక్స్ ప్లోడ్ అవుతుంది #G2 లోడింగ్ అని పెట్టాడు అడివి శేష్. అయితే ఈ కామెంట్ ఒక్కటి పెడితే మ్యాటర్ ఎలా కన్వే అవుతుంది. అందుకే ఎంఎస్ ధోని ఫోటో ఒకటి జత చేశాడు. ఆఫ్టర్ 303 డేస్ ఎం.ఎస్ ధోని మరో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ధోని ఫ్యాన్స్ అంతా కూడా ఎంజాయ్ చేసేలా ఆ మ్యాచ్ నడిచింది. అయితే ఆ ఫోటో పెట్టి అడివి శేష్ జీ 2 లోడింగ్ అని పెట్టాడు.

2018 లో వచ్చిన గూఢచారి సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం గూఢచారి 2 సెట్స్ మీద ఉంది. జి 2 సినిమాను విజయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ను ధోని ఇన్నింగ్స్ తో పోల్చాడు అంటే అడివి శేష్ ప్లాన్ నెక్స్ట్ లెవెల్ లోనే ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాతో పాటుగా డెకాయిట్ తో వస్తున్నాడు అడివి శేష్.

డెకాయిట్ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆమధ్య వచ్చిన డెకాయిట్ టీజర్ కూడా ఇంప్రెస్ చేసింది. ఏది ఏమైనా తన మార్క్ ప్రత్యేకమైన సినిమాలతో అడివి శేష్ అదరగొట్టేస్తున్నాడు. రాబోతున్న గూఢచారి 2, డెకాయిట్ సినిమాలు కూడా ధోని ఇన్నింగ్స్ లానే దుమ్ము దులిపేస్తాడేమో చూడాలి. అడివి శేష్ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు అంటే సినిమాలు అనుకున్న దాని కన్నా బెటర్ గా వస్తున్నాయని చెప్పొచ్చు. అడివి శేష్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త కథలతో కొత్త ప్రయోగాలు చేస్తున్న అడివి శేష్ రాబోయే సినిమాలతో పెద్ద ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది.