Begin typing your search above and press return to search.

అడివి శేష్ G2.. రంగంలోకి మరో పవర్ఫుల్ యాక్టర్

విభిన్నమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యువ నటుడు అడివి శేష్ ఇప్పుడు గూడచారి సీక్వెల్ G2 తో సిద్ధమవుతున్న విషయం తెలిసింది.

By:  Tupaki Desk   |   15 Feb 2024 7:33 AM GMT
అడివి శేష్ G2.. రంగంలోకి మరో పవర్ఫుల్ యాక్టర్
X

విభిన్నమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యువ నటుడు అడివి శేష్ ఇప్పుడు గూడచారి సీక్వెల్ G2 తో సిద్ధమవుతున్న విషయం తెలిసింది. గతంలో వచ్చిన గూడచారి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను సొంతం చేసుకుంది. నటుడిగా అడివి శేష్ ఆడియోన్స్ లో మరింత నమ్మకాన్ని ఏర్పరచుకున్నాడు. ఇక ఆ తర్వాత కూడా అతను అదే తరహాలో డిఫరెంట్ సినిమాలతో తన మార్కెట్ ను మరింత పెంచుకుంటూ వెళ్తున్నాడు.


ఇక ఈసారి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా గూడచారి రాబోతోంది. ఇక అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాను మేకర్స్ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో కొంతమంది ప్రముఖ బాలీవుడ్ నటులు కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారని చాలా రోజులుగా ఒక సీనియర్ బాలీవుడ్ హీరో కూడా ఇందులో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకున్నాడు అని చాలా రకాల గాసిప్స్ వచ్చాయి.

అయితే మొత్తానికి ఆ విషయంలో చిత్ర యూనిట్ అధికారికంగా ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది మరెవరో కాదు, బాలీవుడ్లో రొమాంటిక్ హీరోగా ఒకప్పుడు మంచి క్రేజ్ అందుకున్న ఇమ్రాన్ హష్మీ ఇందులో నటించబోతున్నట్లుగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ నటుడుకి ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తూ ఉన్నాయి.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమాలో కూడా అతను ఒక కీలకమైన పాత్రలలో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు అడివి శేష్ G2 కూడా పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిర్మాతలు T.G విశ్వ ప్రసాద్ అభిషేక్ అగర్వాల్.. ఇమ్రాన్ G2 కోసం రావడం చాలా అద్భుతంగా ఉందనీ వారి ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.

బనితా సంధు, లీడింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా హై-ఆక్టేన్ యాక్షన్ తో రానుంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో అడివి శేష్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.