Begin typing your search above and press return to search.

అడ‌వి శేషు మాట‌ల‌కు అర్దం అదేనా?

ఎవ‌రికైనా ఓ టైమ్ వ‌స్తుంది! అప్పుడు కాల‌రెగ‌రేద్దాం! అన్న తీరున ఇప్పుడు శేషు కాల‌రెగ‌రేసి మ‌రీ సినిమాలు చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   17 Dec 2023 6:47 AM GMT
అడ‌వి శేషు మాట‌ల‌కు అర్దం అదేనా?
X

దాదాపు ద‌శాబ్దం పాటు ఇండ‌స్ట్రీలో పోరాటం చేస్తే గానీ అడ‌వి శేషు న‌టుడిగా నిల‌దొక్కుకోలేక‌పోయాడు. మ‌ల్టీ ట్యాలెంటెడ్ అయినా కెరీర్ ఆరంభంలో త‌న ప్ర‌య‌త్నాల‌కు పెద్ద‌గా ప్రోత్సాహం ల‌భించ‌లేదు. న‌టు డిగా ఖాళీ లేకుండా సినిమాలైతే చేసాడు గానీ త‌న మార్క్ ఎందులోనూ ప‌డ‌లేదు. న‌టుడిగా.. ర‌చ‌యిత గా...ద‌ర్శ‌కుడిగా అత‌డి ప్ర‌తిభ‌కి త‌గ్గ ప్రోత్సాహం ఆరంభంలో ద‌క్క‌లేదు. అదే శేషు నేడు ఇండ‌స్ట్రీలో ఎలాంటి స్థానంలో కొన‌సాగుతున్నాడో తెలిసిందే.

ఎవ‌రికైనా ఓ టైమ్ వ‌స్తుంది! అప్పుడు కాల‌రెగ‌రేద్దాం! అన్న తీరున ఇప్పుడు శేషు కాల‌రెగ‌రేసి మ‌రీ సినిమాలు చేస్తున్నాడు. దేశం గ‌ర్వించే సినిమాలు...పాత్ర‌లు పోషిస్తున్నాడు. 'గుఢ‌చారి' స‌క్సెస్ త‌ర్వాత శేషు గ్రాప్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. 'ఎవ‌రు'..'మేజ‌ర్'..'హిట్' లాంటి సినిమాలు శేషుని పాన్ ఇండియా కి రీచ్ అయ్యేలా చేసాయి. ఈసినిమాల‌తో అత‌ను గొప్ప న‌టుడే కాదు అంత‌కు మించి ర‌చ‌యిత కూడా అన్న‌ది ప్రేక్ష‌కుల‌కు అర్ద‌మైంది.

ప్ర‌స్తుతం హీరోగా అత‌ని కెరీర్ కి తిరుగులేదు. చేతిలో బోలెడు అవ‌కాశాలున్నాయి. అత‌డి క‌థ‌లు..మేకింగ్ న‌చ్చిన నిర్మాత‌లు ద‌ర్శ‌కుడిగానూ అవ‌కాశాలిస్తున్నారు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కొన్ని నెట్టింట హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్పుడు చేస్తోన్న రెండు సినిమాలు పూర్త‌య్యాక కేవ‌లం న‌టుడిగా మ‌రో రెండు సినిమాలు మాత్ర‌మే చేస్తాన‌న్నారు. దీన్ని బ‌ట్టి న‌టుడిగా అత‌ని కెరీర్ కి అవే చివ‌రి సినిమాలు అవుతాయా? అన్న సందేహాలు మొద‌ల‌య్యాయి.

అలాగని ద‌ర్శ‌కుడిగా బాధ్య‌త‌లు తీసుకుంటారా? అంటే దానికి అంగీక‌రించ‌లేదు. అందుకు ఎంతో ఓపిక‌...స‌హానం కావాలి అన్నారు. అలాగే ర‌చ‌న ప‌రంగా ఇత‌ర హీరోల‌కు క‌థ‌లు అందిస్తారా? అంటే అది కేవ‌లం త‌న సినిమాల వ‌ర‌కే ప‌రిమింత అంటున్నారు. దీంతో శేషు కెరీర్ పై నెట్టింట ర‌క‌ర‌కాల ప్ర‌చారం సాగుతుంది. ఆయ‌న సినిమాల‌కు పూర్తిగా దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని..అందుకే న‌టుడిగా ఉండ‌గానే రిటైర్మెంట్ తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.