Begin typing your search above and press return to search.

జోడి బాగుంది.. కెమిస్ట్రీ కుదిరేలా ఉంది..!

నాని హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హిట్ 2 హీరో అడివి శేష్ హిట్ 3 హీరో శ్రీనిధి శెట్టిని సరదాగా ఆటపట్టించాడు.

By:  Tupaki Desk   |   1 May 2025 1:30 AM
Adivi Sesh Srinidhi Shetty Pair
X

ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కుదిరితే ఆ జంట ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు కనిపించినా కూడా వాళ్లకి సూపర్ పాపులారిటీ ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఈ జోడీ అదుర్స్ అనిపించేలా కొన్ని జంటలు ఉంటాయి. ఐతే ఒక సినిమా కలిసి చేయకపోయినా ఒక హీరో హీరోయిన్ ఇద్దరు అలా కలిసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తే అదిరిపోతుంది. నాని హిట్ 3 ఈవెంట్ లో అలాంటి జోడీ కెమెరా కంటికి చిక్కింది.

నాని హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హిట్ 2 హీరో అడివి శేష్ హిట్ 3 హీరో శ్రీనిధి శెట్టిని సరదాగా ఆటపట్టించాడు. శేష్, శ్రీనిధి పక్క పక్కనే ఉండగా శేష్ షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు ఇచ్చి చేయి వెనక్కి అనగా శ్రీనిధి ఒక్కసారిగా అవాక్కవుతుంది. ఆ టైంలో శేష్ మీద గుర్రుగా ఉంటుంది. ఇదంతా చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఐతే ఈ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్లు ఈ జోడీ బాగుంది.. కెమిస్ట్రీ కూడా కుదిరింది అనేస్తున్నారు.

అంతేకాదు ఈ ఇద్దరిని పెట్టి ఒక సినిమా చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఇద్దరు కలిసి నటిస్తే ఏర్పడే కెమిస్ట్రీ కాస్త జస్ట్ ఒక ఈవెంట్ లో ఇద్దరు అలా సరదాగా మాట్లాడుతుంటే ఆడియన్స్ లో ఆ క్రేజ్ రావడం సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. హిట్ 3 తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది శ్రీనిధి శెట్టి. ఆ నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా సినిమా చేస్తుంది.

హిట్ 3 సక్సెస్ అయితే తెలుసు కదా సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడుతుంది. ఇక అడివి శేష్, శ్రీనిధి పెయిర్ బాగుందనిపిస్తుంది కాబట్టి శేష్ కూడా నెక్స్ట్ తన సినిమాలో శ్రీనిధిని తీసుకుంటాడేమో చూడాలి. తప్పకుండా శ్రీనిధి తెలుగు తెర మీద కొన్నాళ్లు అలరించేలా సినిమాలు చేయాలని ఆమె తెలుగు ఫాలోవర్స్ కోరుతున్నారు. ఇక అడివి శేష్ సినిమాల విషయానికి వస్తే ఓ పక్క డెకాయిట్ అంటూ ఒక సినిమా చేస్తూ మరోపక్క జి 2 ని పూర్తి చేసే పనుల్లో ఉన్నాడు అడివి శేష్. ఆ రెండు సినిమాల తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటన్నది తెలుస్తుంది.