హిట్3.. ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన శేష్!
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హిట్2 హీరో అడివి శేష్ హాజరై, హిట్3 మొదటి రివ్యూ ను స్టేజ్ పై చెప్పేశాడు.
By: Tupaki Desk | 28 April 2025 9:59 AMనాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్‌పోస్టర్ సినిమాస్ బ్యానర్ నిర్మించిన సినిమా హిట్3. హిట్‌వర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమా మే 1న రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హిట్2 హీరో అడివి శేష్ హాజరై, హిట్3 మొదటి రివ్యూ ను స్టేజ్ పై చెప్పేశాడు.
ఈ ఈవెంట్ కు తాను ఫ్యామిలీ మెంబర్ లా వచ్చానని, నాని తనకు పెద్దన్నలాంటి వాడని, తన సినిమాకు సంబంధించిన పెద్ద ఫంక్షన్ జరుగుతుంటే తాను రాకుండా ఎలా ఉంటానన్న శేష్, ఆల్రెడీ తాను హిట్3 లోని ఆఖరి 30 నిమిషాలు చూశానని, స్టన్నింగ్ గా ఉందని చెప్పాడు. హిట్3లో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉంటాయని, సినిమా లాస్ట్ 30 మినిట్స్ క్రేజీగా ఉందని చెప్పాడు.
అంతేకాదు, సినిమాలోని సర్‌ప్రైజ్ లు చూడ్డానికి తాను కూడా అందరితో పాటూ ఎగ్జైటింగ్ గా ఉన్నానన్నాడు. శైలేష్ ఎంతో టాలెంటెడ్ అని సినిమాలను చాలా వేగంగా పూర్తి చేస్తాడని, తాను గూఢచారి2 మూవీ అనౌన్స్ చేసి 60% షూటింగ్ పూర్తి చేసేసరికి శైలేష్ హిట్3ను అనౌన్స్ చేసి, షూటింగ్ చేసి, రిలీజ్ కు రెడీ చేశాడని, ఈ ఫాస్ట్ వర్కింగ్ ఏంటో తనకు కూడా నేర్పమని అడిగాడు.
రాజమౌళి ముందు మాట్లాడాలంటే తనకు కొంచెం నెర్వస్ గా ఉంటుందని, తాను శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫిల్మ్ స్కూల్ లో ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ బాహుబలినే తనకు పెద్ద యాక్టింగ్ స్కూల్ అని, అసలు పట్టుదల అనేది తాను అక్కడే నేర్చుకున్నానని, అక్కడ నేర్చుకున్నదే తాను ఇప్పుడు కెరీర్లో అప్లై చేసుకుంటూ ముందుకెళ్తానని, అందుకే రాజమౌళి ఎప్పుడు కనిపించినా ఆయన్ని చూసి జస్ట్ స్మైల్ ఇచ్చి వెళ్లడం తప్ప పెద్దగా మాట్లాడనని, ఆయన ముందు మాట్లాడటానికి తనకేం ఉండవని శేష్ తెలిపాడు.
ఈ మధ్య సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిందని, సినిమా బావుంటే దాన్ని వైరల్ చేయడానికి అందరూ రెడీగా ఉన్నారని, హిట్3 సినిమా ఆ రేంజ్ లో హిట్ అవుతుందని, ఈ సినిమాతో నాని బ్రో మాస్సివ్ హిట్ అందుకోబోతున్నాడని, మే 1 నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని శేష్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అయితే శేష్ చెప్పిన సర్‌ప్రైజుల్లో ఒక సర్‌ప్రైజ్ తన క్యామియో అని అదే ఈవెంట్ ఫైట్ మాస్టర్ సతీష్ లీక్ చేశాడు.