Begin typing your search above and press return to search.

డెకాయిట్ మూవీ.. శ్రుతి తప్పుకోవడానికి కారణం చెప్పిన శేష్..

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోస్ లిస్ట్ లో నటుడు అడివి శేష్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు.

By:  Tupaki Desk   |   1 July 2025 6:52 PM IST
డెకాయిట్ మూవీ.. శ్రుతి తప్పుకోవడానికి కారణం చెప్పిన శేష్..
X

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోస్ లిస్ట్ లో నటుడు అడివి శేష్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సత్తా చాటుతున్నారు. తనదైన శైలిలో నటిస్తూ విజయాలు అందుకుంటున్నారు. తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను అడివి శేష్ సొంతం చేసుకున్నారు.

ఇప్పుడు గూఢచారి 2, డెకాయిట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు అడివి శేష్. ప్రస్తుతం ఆ రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. రెండింటిపైనా ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే హైలీ యాంటిసిపేటెడ్‌ పాన్‌ ఇండియా థ్రిల్లర్‌ గా డెకాయిట్ రూపొందుతున్న విషయం తెలిసిందే.

షానియల్‌ డియో దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో ఎస్ ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆమె ఫస్ట్ లుక్, గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

అయితే సినిమాలో హీరోయిన్ గా ముందుగా శ్రుతి హాసన్ ను తీసుకున్నారు. టైటిల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. కానీ కాస్త షూటింగ్ జరిగిన తర్వాత ఆమె తప్పుకున్నారు. ఆ సమయంలో పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇప్పుడు వాటిపై హీరో అడివి శేష్ రెస్పాండ్ అయ్యారు.

శ్రుతి తప్పుకోవడంలో ఎలాంటి డ్రామా లేదని క్లారిటీ ఇచ్చారు. వర్కింగ్ స్టైల్ లో డిఫరెన్సెస్ తోపాటు కూలీ మూవీ షెడ్యూల్స్ తో బిజీగా ఉండడం వల్ల ఆమె తప్పుకున్నట్లు తెలిపారు. అదంతా ఫ్రెండ్లీగా జరిగిందని చెప్పారు. ఎలాంటి ఇష్యూ లేదని అన్నారు. దీంతో ఇప్పటికే వచ్చిన వార్తలకు, రూమర్లకు చెక్ పెట్టారు.

అయితే మూవీ షూటింగ్ దాదాపు 60 శాతం కంప్లీట్ అయిందని అడివి శేష్ తెలిపారు. రెండు భాషల్లో క్రెడిబిలిటీ మిస్ అవ్వకుండా మూవీ టీమ్ చాలా కృషి చేస్తోందని తెలిపారు. కొన్ని సీన్స్ ను తెలుగు, హిందీలో వేర్వేరు నటులతో షూట్ చేస్తున్నట్లు చెప్పారు. క్రిస్మస్ కు సినిమాను తీసుకొస్తామని మరోసారి అనౌన్స్ చేశారు. మరి మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.