Begin typing your search above and press return to search.

నెట్టింట శేష్ పోస్ట్ వైర‌ల్.. ఏమంటున్నాడంటే

నేచురల్ స్టార్ నాని హీరోగా ఉంటూ నిర్మించిన సినిమా హిట్3. మే 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా మిక్డ్స్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకెళ్తుంది.

By:  Tupaki Desk   |   12 May 2025 10:34 AM
నెట్టింట శేష్ పోస్ట్ వైర‌ల్.. ఏమంటున్నాడంటే
X

నేచురల్ స్టార్ నాని హీరోగా ఉంటూ నిర్మించిన సినిమా హిట్3. మే 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా మిక్డ్స్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకెళ్తుంది. ఇప్ప‌టికే హిట్3 సినిమా దాదాపు అన్ని ఏరియాల్లో రిక‌వ‌రీ అయిన‌ట్టు స‌మాచారం. ఆల్మోస్ట్ అంద‌రూ సేఫ్ అయి, లాభాల బాట ప‌ట్టిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు చెప్తున్నాయి.


శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో హిట్2 హీరో అడివి శేష్ కీల‌క పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. కేడీ పాత్ర‌లో హిట్2 సినిమాలో అల‌రించిన అడివి శేష్, హిట్3 సినిమాలో నాని ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు అత‌నే వ‌చ్చి కాపాడతాడు. హిట్3 లో శేష్ క్యామియో చాలా సింపుల్ గా ఉంటూనే ఇంప్రెస్సివ్ గా ఉంది.

ఇదిలా ఉంటే సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అడివి శేష్ తాజాగా ఎక్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ లో త‌న కోస్టార్ నాని తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, బ్ర‌ద‌ర్ ఫ్ర‌మ్ అన‌ద‌ర్ మ‌ద‌ర్ అని రాసుకొచ్చాడు. వీరిద్ద‌రూ క‌లిసి హాస్పిటల్ లో ఉన్న‌ప్పుడు ఆ ఫోటోను తీసిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది. ఆ ఫోటోను హిట్3 హీరోయిన్ శ్రీనిధి శెట్టి తీసిన‌ట్టు కూడా శేష్ త‌న పోస్ట్ లో పేర్కొన్నాడు.

ప్ర‌స్తుతం శేష్ ఎక్స్ లో చేసిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇక శేష్ కెరీర్ విష‌యానికొస్తే, ప్ర‌స్తుతం గూఢ‌చారి2, డెకాయిట్ సినిమాల్లో న‌టిస్తున్నాడు. ఈ రెండు సినిమాల‌పై శేష్ చాలానే ఆశ‌లు పెట్టుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కంటెంట్ బేస్డ్ సినిమాల‌కే ప్రాధాన్య‌తనిస్తూ వ‌స్తున్న శేష్ ఈ సినిమాల‌తో ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటాడో చూడాలి.