గాయాలతోనే కానిచ్చేసిన హీరో హీరోయిన్!
అయితే ఇప్పుడు మరో సినిమా షూటింగ్ స్పాట్ లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న డెకాయిట్ సెట్స్ లో ప్రమాదం జరిగింది.
By: Tupaki Desk | 23 July 2025 4:05 PM ISTఈ మధ్య సినిమాలన్నీ ఏదొక కారణంగా షూటింగులు లేటవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలు షూటింగుల వల్ల లేటైతే మరికొన్ని వీఎఫెక్స్, పోస్ట్ ప్రొడక్షన్ వల్ల ఆలస్యమవుతున్నాయి. ఇంకొన్ని సినిమాలు ఆయా చిత్ర షూటింగ్ టైమ్ లో జరిగే ప్రమాదాల వల్ల లేటవుతున్నాయి. అయితే ఈ మధ్య షూటింగుల్లో ప్రమాదాలు జరగడం బాగా ఎక్కువైపోయింది.
మొన్నా మధ్య సెట్ కాలిపోవడంతో కాంతార2 షూటింగ్ ఆగిపోగా, రీసెంట్ గా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ సినిమాలో కూడా ప్రమాదం జరిగి షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో సినిమా షూటింగ్ స్పాట్ లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న డెకాయిట్ సెట్స్ లో ప్రమాదం జరిగింది.
షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తూ హీరో అడివి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కిందపడగా వారికి కాస్త బాగానే దెబ్బలు తగిలినట్టు తెలుస్తోంది. గాయాలైనప్పటికీ వారిద్దరూ ఆ గాయాలతోనే షూటింగ్ ను పూర్తి చేశారని సమాచారం. అయితే డెకాయిట్ షూటింగులో ప్రమాదం జరగడం ఇదేం మొదటిసారి కాదు, గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగ్గా షూటింగ్ సెట్ లో గాయపడ్డట్టు మృణాల్ ఫోటోలు కూడా షేర్ చేసిన సంగతి తెలిసిందే.
షానిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడింది లేదు.
