హిట్ 3 సర్ ప్రైజ్.. రెస్పాన్స్ ఎలా ఉందంటే..
ఈ సినిమా గత వారం రిలీజై, నాలుగు రోజుల్లో రూ.101 కోట్ల గ్రాస్ సాధించి థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులతో దూసుకెళ్తోంది.
By: Tupaki Desk | 6 May 2025 5:27 AMటాలీవుడ్‌లో నెవ్వర్ బిఫోర్ అనేలా థ్రిల్లర్స్‌తో బ్లాక్‌బస్టర్స్ అందిస్తూ యంగ్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు అడివి శేష్. మేజర్, గూఢచారి,క్షణం లాంటి సినిమాలతో బాక్సాఫీస్ పరంగా కూడా తన రేంజ్ ను మరింత పెంచుకున్నాడు. హిట్ 2 అతని కెరీర్ లో మరో బిగ్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు నాని నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ సినిమాలో అతను చేసిన కామియో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సినిమా గత వారం రిలీజై, నాలుగు రోజుల్లో రూ.101 కోట్ల గ్రాస్ సాధించి థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులతో దూసుకెళ్తోంది. ‘హిట్ 3’లో అడివి శేష్ కృష్ణ దేవ్ పాత్రలో సర్‌ప్రైజ్ కామియో చేశాడు. ‘హిట్’ ఫ్రాంచైజ్‌లో గతంలో ఈ క్యారెక్టర్‌లో కనిపించిన శేష్, ఈ సినిమాలో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు.
అతని ఎంట్రీ సీన్‌తో థియేటర్లు దద్దరిల్లాయి. నాని అర్జున్ సర్కార్ రోల్‌లో సినిమాను ముందుకు తీసుకెళ్తుండగా, శేష్ కామియో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ ఇద్దరు హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న కీలక సన్నివేశం ఆడియన్స్‌ను ఫుల్ ఎంటర్‌టైన్ చేసింది. సినిమా క్లైమాక్స్‌లో అడివి శేష్ ఎంట్రీ సరైన టైమింగ్‌లో వచ్చిందని, ఇది సినిమాకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిందని ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు.
శేష్ స్టైలిష్ లుక్, యాక్షన్ సీన్స్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. ఎలాంటి ఈగో లేకుండా నానితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అతని మిస్టర్ పర్ఫెక్ట్ నేచర్‌ను చాటుతోందని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. ఇక ‘హిట్ 3’ సినిమా నాని కెరీర్‌లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల గ్రాసర్‌గా నిలిచింది. నార్త్ అమెరికాలో $2 మిలియన్ మార్క్‌ను దాటి, నాని కెరీర్‌లో మూడో $2 మిలియన్ గ్రాసర్‌గా రికార్డు సృష్టించింది.
శైలేష్ కొలను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ‘A’ రేటింగ్‌తో ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రౌడ్‌ను ఆకర్షిస్తోంది. హాలీవుడ్ స్టైల్ బ్యాక్‌డ్రాప్, యాక్షన్ సీన్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ సినిమాకు బలంగా నిలిచాయి. ఈ సినిమా థియేటర్లకు ఊపిరి పోస్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా, ‘హిట్ 3’లో అడివి శేష్ కామియో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. నాని, శేష్ కాంబినేషన్ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా నాని, శేష్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ రికార్డ్ గా నిలవనుందని చెప్పవచ్చు.