Begin typing your search above and press return to search.

నేనెప్పుడూ ఇంతే.. కాక‌పోతే ఇప్పుడు బ‌య‌ట ప‌డిందంతే

అయితే ఆ ప్రాజెక్టు లేట‌వడానికి కొన్ని సార్లు నాణ్య‌త కార‌ణ‌మైతే మ‌రికొన్ని సార్లు అనివార్య కార‌ణాల వ‌ల్ల సినిమాలు లేట‌వుతూ వ‌స్తుంటాయి.

By:  Tupaki Desk   |   4 Nov 2025 6:00 AM IST
నేనెప్పుడూ ఇంతే.. కాక‌పోతే ఇప్పుడు బ‌య‌ట ప‌డిందంతే
X

కొన్ని సినిమాలు ఎప్పుడో మొద‌లైనా పూర్త‌వ‌డానికి చాలా టైమ్ ప‌డుతుంది. అయితే ఆ ప్రాజెక్టు లేట‌వడానికి కొన్ని సార్లు నాణ్య‌త కార‌ణ‌మైతే మ‌రికొన్ని సార్లు అనివార్య కార‌ణాల వ‌ల్ల సినిమాలు లేట‌వుతూ వ‌స్తుంటాయి. దాని వ‌ల్లే సినిమాలు ఎక్కువ కాలం సెట్స్ పై ఉంటూ ఉంటాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయా సినిమాల కోసం ఆడియ‌న్స్ ఎక్కువ‌గా ఎదురుచూస్తుంటారు.

డెకాయిట్, గూఢ‌చారి2 తో బిజీగా శేష్

టాలీవుడ్ టాలెంటెడ్ న‌టుడు అడివి శేష్ న‌టిస్తున్న ఓ సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితులే ఏర్ప‌డ్డాయి. అదే గూఢ‌చారి2. అడివి శేష్ ప్ర‌స్తుతం డెకాయిట్ అనే రొమాంటిక్ డ్రామా తో పాటూ గూఢ‌చారి2 అనే సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీటిలో డెకాయిట్ వ‌చ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ కానుండ‌గా, గూఢ‌చారి2 కోసం మాత్రం ఇంకా టైమ్ పట్టేట్టుంది.

గూఢ‌చారి2 లేట్ పై శేష్ క్లారిటీ

గూఢచారి2 కోసం సాధార‌ణ ఆడియ‌న్స్ మాత్ర‌మే కాకుండా సినీ విమ‌ర్శ‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్త‌వానికి గూఢ‌చారి2 ఎప్పుడో రిలీజ‌వాల్సింది కానీ ఈ సినిమా కోసం శేష్ ఎక్కువ టైమ్ తీసుకుంటున్నార‌ని అంద‌రూ భావిస్తున్న నేప‌థ్యంలో ఈ విష‌యంపై శేష్ క్లారిటీ ఇచ్చారు. తాను సినిమాలు తీయ‌డానికి ఎప్పుడూ ఇంతే టైమ్ తీసుకుంటాన‌ని, కాక‌పోతే ఆడియ‌న్స్ కు ఇప్పుడీ విష‌యం తెలిసింద‌ని అన్నారు.

ఆడియ‌న్స్ కు గుర్తుండిపోయే సినిమాలు చేయ‌డ‌మే ముఖ్యం

కోవిడ్ లో మేజ‌ర్ మూవీ చేయ‌డానికి కూడా తానింతే టైమ్ తీసుకున్నాన‌ని, కానీ ఆడియ‌న్స్ దాన్ని కోవిడ్ అనుకున్నార‌ని, గూఢ‌చారి చేయ‌డానికి కూడా త‌న‌కు రెండేళ్లు ప‌ట్టింద‌ని, తన‌కు వేగంగా సినిమాలు తీయ‌డం కంటే ఆడియ‌న్స్ కు గుర్తుండిపోయేలా సినిమాలు తీయ‌డ‌మే ముఖ్య‌మ‌ని చెప్పారు. అయితే సినిమా ఆల‌స్య‌మవుతున్న కార‌ణంగా త‌న నిర్మాత‌ల‌కు ఎక్కువ ఖ‌ర్చు కాకుండా ఉండేలా కూడా తాను చూసుకుంటున్నాన‌ని శేష్ చెప్పారు.