Begin typing your search above and press return to search.

గ్లింప్స్ అదుర్స్.. శేష్ 'డెకాయిట్' రిలీజ్ ఎప్పుడంటే?

డెకాయిట్ కు అడివి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 May 2025 12:06 PM IST
గ్లింప్స్ అదుర్స్.. శేష్ డెకాయిట్ రిలీజ్ ఎప్పుడంటే?
X

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ యాక్షన్ డ్రామా డెకాయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఆ సినిమాకు షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.


డెకాయిట్ కు అడివి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్, లుక్స్ మూవీపై భారీ హోప్స్ ను క్రియేట్ చేశాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

అయితే టీజర్ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వని మేకర్స్.. రీసెంట్ గా గ్లింప్ ను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. చెప్పినట్లు.. ఆదివారం ఉదయం రిలీజ్ చేశారు. సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. శేష్, మృణాల్ పోస్టర్ ను కూడా రివీల్ చేశారు.

మృణాల్ ఎంట్రీతో గ్లింప్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏ జూలియట్.. ఏం జరిగింది.. మామూలు విషయం కాదు.. నేను మోసం చేయడానికి రాలేదు.. అంటూ అడివి శేష్ వచ్చారు. అలా కంటిన్యూషన్ గా.. యాక్షన్ సీన్స్ ను యాడ్ చేశారు మేకర్స్. అవి గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. గ్లింప్స్ కు స్పెషల్ గా అట్రాక్షన్ గా నిలిచాయి.

అయితే గ్లింప్స్ లో శేష్ తన యాక్టింగ్ తో అదరగొట్టారు. యాక్షన్ సీక్వెన్స్ లో తన మార్క్ చూపించారు. మృణాల్ సీరియస్ లుక్ లో ఉన్నారు. మొత్తానికి గ్లింప్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయని నెటిజన్లు చెబుతున్నారు.

కాగా, ఇప్పటికే డెకాయిట్ మూవీ రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోందని టాక్. సినిమా ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్టు వార్తలు వస్తున్నాయి. రూ.8 కోట్లకు ప్రముఖ సంస్థ సోనీ ఆడియో రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తుంది. శేష్ కెరీర్ లో అతి పెద్ద డీల్ అని సమాచారం. మరి మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి హిట్ అవుతుందో అంతా వేచి చూడాలి.