డెకాయిటే ముందొస్తాడా?
డెకాయిట్ రిలీజ్ డేట్ గురించి ట్రేడ్ వర్గాల్లో ఓ వార్త వినిపిస్తోంది. ఈ సినిమా 2025 డిసెంబర్ లో రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 23 May 2025 8:30 PMటాలీవుడ్ లోని టాలెంటెడ్ నటుల్లో అడివి శేష్ కూడా ఒకడు. అతన్నుంచి సినిమా వస్తుందంటే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. శేష్ ఒక సినిమా చేశాడంటే ఆ సినిమాలో మంచి కంటెంట్ ఉంటుందనే పేరుని అతను సంపాదించుకున్నాడు. అలాంటి శేష్ హీరోగా సినిమా వచ్చి చాలా రోజులవుతుంది. ప్రస్తుతం శేష్ రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి గూఢచారి2 (జీ2) కాగా మరొకటి డెకాయిట్.
ఈ రెండు సినిమాలూ ప్రస్తుతం ప్రొడక్షన్ లోనే ఉన్నాయి. అయితే గూఢచారి2 మరియు డెకాయిట్ సినిమాల్లో ముందుగా జీ2 సినిమానే రిలీజవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ జీ2 కంటే ముందు డెకాయిట్ సినిమానే రిలీజవుతున్నట్టు తెలుస్తోంది. డెకాయిట్ సినిమాకు షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు.
షానియల్ డియో అంటే మరెవరో కాదు, శేష్ నటించి సూపర్ హిట్లు అందుకున్న క్షణం, గూఢచారి సినిమాలకు అతను సినిమాటోగ్రఫర్ గా పని చేశాడు. డెకాయిట్ రిలీజ్ డేట్ గురించి ట్రేడ్ వర్గాల్లో ఓ వార్త వినిపిస్తోంది. ఈ సినిమా 2025 డిసెంబర్ లో రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. డెకాయిట్ రిలీజ్ డేట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ను మేకర్స్ సోమవారం రోజున ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.
ఈ సినిమాలో ముందుగా శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకుని కొంత భాగం షూటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల శృతి డెకాయిట్ నుంచి తప్పుకోగా ఆ స్థానంలోకి మృణాల్ ఠాకూర్ వచ్చింది. డెకాయిట్ సినిమాతో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ టాలీవుడ్ లోకి నటుడిగా అడుగుపెడుతున్నారు. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, డెకాయిట్ తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది.