Begin typing your search above and press return to search.

అడివి శేష్.. మూవీల రిలీజ్ ప్లాన్ ఇలా!

టాలీవుడ్ యంగ్ అడివి శేష్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. విభిన్నమైన ప్రయత్నాలు చేసే హీరోల లిస్ట్ లో కచ్చితంగా టాప్ లో ఉంటారు.

By:  Tupaki Desk   |   18 May 2025 11:58 AM
Adivi Sesh Gears Up for 2025 with ‘Dacoit’ and ‘Goodachari 2’
X

టాలీవుడ్ యంగ్ అడివి శేష్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. విభిన్నమైన ప్రయత్నాలు చేసే హీరోల లిస్ట్ లో కచ్చితంగా టాప్ లో ఉంటారు. మాస్ కు దూరంగా.. కమర్షియల్ జోలికి వెళ్లకుండా తన సినిమాలతో మెప్పిస్తుంటారు. క్షణం మూవీ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు వెళ్తున్నారు. వరుస హిట్స్ ను అందుకున్నారు.

గూఢచారి, మేజర్, హిట్ 2 ది సెకెండ్ కేస్ వంటి చిత్రాలతో వేరే లెవెల్ హిట్స్ ను సొంతం చేసుకున్నారు. కానీ ఆయన మూవీ రిలీజ్ అయ్యి ఎక్కువ గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు ఆయన రెండు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి డెకాయిట్ కాగా.. మరొకటి సూపర్ హిట్ మూవీ గూఢచారి సీక్వెల్ గూఢచారి-2.

ఇప్పుడు ఆ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కానీ ఏది ముందు రిలీజ్ అవుతుందన్న విషయంపై క్లారిటీ లేదు. అయితే రీసెంట్ గా జరిగిన హిట్-3 సక్సెస్ మీట్ లో తన సినిమాల మధ్య గ్యాప్ ను తగ్గిస్తానని హామీ ఇచ్చారు శేష్. అందుకు తగ్గట్లే ఇప్పుడు తన అప్ కమింగ్ ప్రాజెక్టుల రిలీజ్ ప్లాన్ ను వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తన చేతిలో ఉన్న రెండు సినిమాల్లో ముందు.. డెకాయిట్ ను రిలీజ్ చేయాలని అడివి శేష్ డిసైడ్ అయినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఆ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ముందు శ్రుతి హాసన్ ఫిమేల్ లీడ్ రోల్ పోషించగా.. ఆ తర్వాత తప్పుకున్నారు.

దీంతో మృణాల్ ను సెలెక్ట్ చేసిన మేకర్స్.. ఇప్పుడు షూటింగ్ ను జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. మరోవైపు గూఢచారి-2 కొన్ని నెలల క్రితం స్టార్ట్ అయింది. ఫస్ట్ పార్ట్.. చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో సీక్వెల్ పై మంచి అంచనాలు ఉన్నాయి.

వినయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాను భారీ బడ్జెట్ తో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్టైన్మెంట్స్‌, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కూడా రూపొందిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఆ సినిమాను రిలీజ్ చేసేందుకు వారితోపాటు అడివి శేష్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీంతో డెకాయిట్ ను 2025లో విడుదల చేయనున్నట్లు సమాచారం. దీంతో యంగ్ హీరో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.