బైబిల్, భగవద్గీత.. అడివి శేష్ బ్రదర్ పోస్ట్ వైరల్..
తాజాగా అడివి సాయికిరణ్ వార్తల్లో నిలిచారు. అందుకు కారణం ఆయన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన స్టోరీనే. బైబిల్, భగవద్గీతను పోస్ట్ లో ప్రస్తావించారు.
By: Tupaki Desk | 6 July 2025 1:10 PM ISTడైరెక్టర్ అడివి సాయికిరణ్ గురించి అందరికీ తెలిసిందే. యంగ్ హీరో అడివి శేష్ కు కజిన్ అయిన ఆయన.. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నటుడు కృష్ణుడు లీడ్ రోల్ నటించిన వినాయకుడు (2008) మూవీతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు.
ఆ తర్వాత విలేజ్ లో వినాయకుడు సినిమా తెరకెక్కించగా.. అనంతరం రొమాంటిక్ ఎంటర్టైనర్ కేరింత మూవీ తీశారు. 2015లో రిలీజ్ అయిన ఆ చిత్రం మంచి హిట్ గా నిలిచింది. చివరగా.. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాను తెరకెక్కించారు. 2019లో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పటివరకు మరో మూవీ ప్రకటించలేదు.
తాజాగా అడివి సాయికిరణ్ వార్తల్లో నిలిచారు. అందుకు కారణం ఆయన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన స్టోరీనే. బైబిల్, భగవద్గీతను పోస్ట్ లో ప్రస్తావించారు. దీంతో ఆయన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనేక మంది నెటిజన్లు రెస్పాండ్ అయ్యి తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలేం పెట్టారంటే?
కొందరు బడా ప్లాట్ ఫామ్ నిర్వాహకులు తనకు ఫోన్ చేసి సినిమా నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నారని చెప్పినట్లు తెలిపారు. దాంతో సరే అన్నానని, అప్పుడు వారు బైబిల్ (బౌండ్ స్క్రిప్ట్) కావాలని అన్నారని తెలిపారు. వెంటనే తాను బైబిల్ కాదు, భగవద్గీత ఇస్తానని బదులిచ్చానని పేర్కొన్నారు. తాను గర్వంగా చెప్పుకునే హిందువన్నారు.
"మతాన్ని సృజనాత్మకతలోకి ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు, నేను హిందువును. సినిమా నిర్మాణంలో అలాంటి మతపరమైన మానిప్యులేటివ్ పద్ధతులను అనుమతించను. నేను వారి ఆఫర్‌ను తిరస్కరించాను- జై శ్రీరామ్" అని అడివి సాయికిరణ్ తెలిపారు. దీంతో కొందరు నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.