Begin typing your search above and press return to search.

ఆమెకు బ్రేక‌ప్ చెప్పి ఈమెతో హీరోగారి పార్టీలు

రెండు సంవత్సరాల డేటింగ్ తర్వాత బాలీవుడ్ యువ‌జంట‌ అనన్య పాండే- ఆదిత్య‌రాయ్ క‌పూర్ విడిపోయిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి

By:  Tupaki Desk   |   9 May 2024 3:30 PM GMT
ఆమెకు బ్రేక‌ప్ చెప్పి ఈమెతో హీరోగారి పార్టీలు
X

రెండు సంవత్సరాల డేటింగ్ తర్వాత బాలీవుడ్ యువ‌జంట‌ అనన్య పాండే- ఆదిత్య‌రాయ్ క‌పూర్ విడిపోయిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్తలు వెలువడిన కొద్ది రోజులకే ఇప్పుడు ఆదిత్య రాయ్ కపూర్ అందాల నాయిక‌ సారా అలీ ఖాన్‌తో కలిసి పార్టీలు చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఆదిత్య - అనన్య ఇద్దరూ విడిపోయార‌ని ప్ర‌చార‌మ‌వుతున్నాకానీ, దానిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న‌లు చేయ‌లేదు. సోష‌ల్ మీడియాల్లో ఆదిత్య కానీ, అన‌న్య కానీ దీనిని రివీల్ చేయ‌లేదు.

ఇంత‌లోనే కొత్త స్నేహం.. ఆదిత్య - సారా జంట‌ ఫోటోలు కొన్ని అంతగా స్ప‌ష్ఠంగా లేనివి ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో ఇద్దరూ పార్టీలో సరదాగా గడుపుతూ క‌నిపించారు. ద‌ర్శ‌క‌నిర్మాత‌ అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న మెట్రో...ఇన్ డినో సినిమా సెట్స్‌లోని ఫోటోలు ఇవి అని ప్ర‌చారం సాగుతోంది. అనురాగ్ బసు తన 54వ పుట్టినరోజును మే 8న జరుపుకున్నారు. అతడి సినిమాలోని ప్రధాన తారలు ఈ స్పెష‌ల్ డేని గుర్తుండిపోయేలా సెల‌బ్రేట్ చేసార‌ని తెలుస్తోంది. ఈ ఫోటోలలో ఆదిత్య- సారా ఇద్దరూ సాధారణ దుస్తులను ధరించి కనిపించారు. ఒక ఫోటోలో వారు చప్పట్లు కొడుతూ క‌నిపించ‌గా, మ‌రో చోట‌ చిరునవ్వుల‌తో మెరిపిస్తూ అందంగా కనిపించారు.

మెట్రో...ఇన్ డినో 2007లో హిట్ అయిన 'లైఫ్ ఇన్ ఏ మెట్రో'కి స్పిన్ ఆఫ్. ఆదిత్య- సారాతో పాటు ఇందులో ఫాతిమా సనా షేక్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, కొంకణా సేన్ శర్మ, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్ త‌దిత‌రులు నటిస్తున్నారు. ఈ సినిమా చ‌క్క‌ని ప్ర‌జాద‌ర‌ణ పొందింది.

2022 లో ఆదిత్య - అనన్య డేటింగ్ గురించి క‌థ‌నాలొచ్చాయి. గత సంవత్సరం స్పెయిన్‌లో వారి రహస్య విహారయాత్ర నుండి ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇది వారి మ‌ధ్య రిలేష‌న్ ని ధృవీక‌రించింది. మార్చిలో, ఇద్దరూ కలిసి జామ్‌నగర్‌లో జరిగిన అంబానీల ప్రీవెడ్డింగ్ కి కూడా హాజరయ్యారు. కానీ ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్యా చాలా తేడాలు క‌నిపించాయి. ఇది ఈ జంట‌ విడిపోవడానికి దారితీసింది. ఆదిత్య- అనన్య మార్చిలోనే విడిపోయారని, ఇద్దరూ స్నేహపూర్వకంగా ఉండాలని నిర్ణయించుకున్నారని క‌థ‌నాలొచ్చాయి.