Begin typing your search above and press return to search.

అతనితో అనన్యా అలా బయటపడింది!

ఆదిత్య రాయ్ కపూర్ అనన్యా పాండే ఇద్దరు కలిసి పోర్చుగల్ లో సూపర్ గా ఎంజాయ్ చేశారు.

By:  Tupaki Desk   |   20 July 2023 11:51 AM GMT
అతనితో అనన్యా అలా బయటపడింది!
X

బాలీవుడ్ లో మరో క్రేజీ జంట ప్రేమాయణం బయట పడింది. బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ లైగర్ భామ అనన్యా పాండే లు కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారన్న వార్త ముంబై మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. వారి మీద ఎన్ని స్పెషల్ స్టోరీస్ వచ్చినా ఎక్కడ కూడా వారిద్దరు తమ రిలేషన్ గురించి బయట పడలేదు. ఇద్దరు వారి వారి సినిమాలతో బిజీగా ఉంటూ వచ్చారు. కొందరైతే అసలు వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని కూడా అనుకున్నారు.

కానీ ఆదిత్య రాయ్ కపూర్ అనన్యా పాండే ఇద్దరు కలిసి పోర్చుగల్ లో సూపర్ గా ఎంజాయ్ చేశారు. ఇద్దరు సీక్రెట్ గా అక్కడికి వెళ్లినా అక్కడ నుంచి కొన్ని పిక్స్ లీక్ అవడంతో వారి వ్యవహారం బయటపడింది. మన మీడియాలో ఎప్పుడూ ఇద్దరు కలిసి కనిపించింది లేదు. ఎక్కడ డౌట్ రాకుండా చాలా క్లవర్ గా వీరిద్దరు తమ రిలేషన్ మెయిన్ టైన్ చేస్తూ వచ్చారు. కానీ పోర్చుగల్ లో తమని ఎవరు పట్టించుకుంటారులే అనుకోగా అక్కడ నుంచి పిక్స్ లీక్ అయ్యి మ్యాటర్ బయట పడేలా చేశాయి.

ఇక వెళ్లడం విడి విడిగా వెళ్లిన ఇద్దరు అక్కడ నుంచి రావడం మాత్రం కలిసి వచ్చారు. మీడియాకు ఒకేసారి ఆదిత్య, అనన్యా కనిపించి సర్ ప్రైజ్ చేశారు. ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా సంథింగ్ సంథింగ్ అని న్యూస్ లు వస్తున్నాయి అవి ఆడియన్స్ పట్టించుకోలేదు కానీ పోర్చుగల్ దాకా వెళ్లిన వీరి డేటింగ్ వార్తలను తెలుసుకున్నారు.

ఇక ఈ ఇద్దరి సినిమాల విషయానికి వస్తే ఆదిత్య రాయ్ కపూర్ ప్రస్తుతం మెట్రో సినిమా చేస్తున్నాడు. అనన్యా పాండే విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ విజయ్ దేవరకొండతో లైగర్ లో నటించిన అనన్యా రణ్ వీర్ సింగ్ రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానిలో కెమియో రోల్ చేస్తుంది. మరో పక్క డ్రీం గర్ల్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఇదేకాకుండా అనన్యా మరో రెండు ప్రాజెక్ట్ లలో నటిస్తుంది. బాలీవుడ్ నెక్స్ట్ స్టార్ హీరోయిన్ అనన్యానే అనుకునేలా చేసిన అమ్మడు అప్పుడే లవ్ స్టోరీలతో వార్తల్లో నిలుస్తుంది. కొన్నాళ్లు కెరీర్ మీద దృష్టి పెట్టి కెరీర్ టఫ్ గా ఉన్న టైం లో ప్రేమిస్తే బెటర్ అని అనన్యా ఫాలోవర్స్ భావిస్తున్నారు. ఆదిత్య రాయ్ తో అనన్యా లవ్ స్టోరీ ఎక్కడిదాకా వెళ్తుందన్నది తెలియాల్సి ఉంది.