Begin typing your search above and press return to search.

బాహుబలి స్టార్‌ ని పట్టిన #90 దర్శకుడు

ఈటీవీ విన్‌ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్‌ సిరీస్ కు సీక్వెల్‌ ను చేస్తాను అంటూ దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రకటించిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   17 April 2024 4:56 AM GMT
బాహుబలి స్టార్‌ ని పట్టిన #90 దర్శకుడు
X

#90’s - మిడిల్ క్లాస్ బయోపిక్‌ వెబ్‌ సిరీస్‌ ఈ మధ్య కాలంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈటీవీ విన్‌ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్‌ సిరీస్ కు సీక్వెల్‌ ను చేస్తాను అంటూ దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రకటించిన విషయం తెల్సిందే.


ఆ హిట్‌ వెబ్‌ సిరీస్ సీక్వెల్‌ కోసం వెయిట్‌ చేస్తున్న ప్రేక్షకులకు దర్శకుడు ఆదిత్య హాసన్‌ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం #90’s వెబ్‌ సిరీస్ సీక్వెల్‌ కాకుండా కొత్త కథతో మరోసారి వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

ఆదిత్య హాసన్ తదుపరి వెబ్‌ సిరీస్‌ లో బాహుబలి : ది బిగినింగ్‌ లో యువ ప్రభాస్‌ పాత్రలో కనిపించిన నిఖిల్‌ దేవదూల హీరోగా కనిపించబోతున్నాడు. కంచరపాలెంకు చెందిన నిత్య శ్రీ గోరు హీరోయిన్‌ గా నటించబోతుంది. ఈ వెబ్‌ సిరీస్‌ ను కూడా #90’s మాదిరిగా విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందించబోతున్నాడు.

నవీన్‌ మేడారం నిర్మాణంలో ఈ వెబ్‌ సిరీస్ నిర్మాణం జరుగబోతుంది. బాహుబలి తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితు అయిన నిఖిల్‌ దేవదూల కచ్చితంగా ఈ వెబ్‌ సిరీస్‌ తో కెరీర్‌ లో యూటర్న్‌ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ వెబ్‌ సిరీస్ తర్వాత #90’s కి సీక్వెల్‌ ను ఆదిత్య హాసన్ తీస్తాడేమో చూడాలి.