Begin typing your search above and press return to search.

ఐస్ స్కేటింగ్‌లో ప్రేమ జంట రొమాన్స్

కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం విదేశాల‌కు వెళ్లిపోయిన జంట‌లు ఒక‌రొక‌రుగా తిరిగి ఇండియాకు వ‌స్తున్నారు

By:  Tupaki Desk   |   5 Jan 2024 4:14 AM GMT
ఐస్ స్కేటింగ్‌లో ప్రేమ జంట రొమాన్స్
X

కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం విదేశాల‌కు వెళ్లిపోయిన జంట‌లు ఒక‌రొక‌రుగా తిరిగి ఇండియాకు వ‌స్తున్నారు. అలా రిట‌న్ జ‌ర్నీలో విమానాశ్ర‌యంలో కెమెరాల‌కు చిక్కిన జంట‌ల్లో ఆదిత్యారాయ్ క‌పూర్- అన‌న్య పాండే జంట కూడా ఉంది. నిజానికి ఈ జంట డేటింగ్ గురించి అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయిన‌ప్ప‌టికీ, క‌లిసి షికార్లు చేయ‌డంతో అభిమానుల్లో దీనిపై బోలెడంత చ‌ర్చ సాగుతోంది.


ఆదిత్య రాయ్ కపూర్-అనన్య పాండే తాజాగా మరోసారి చర్చనీయాంశంగా మారారు! ఏడాది కాలంగా పుకార్ల న‌డుమ ఈ జోడీ షికార్లకు సంబంధించిన ఫోటోలు ఇంట‌ర్నెట్ లో అగ్గి రాజేసాయి. ఇప్పుడు కొత్త సంవ‌త్స‌రం వేళ విహార‌యాత్ర‌ కారణంగా వార్తల్లోకి వ‌చ్చారు. అన‌న్య‌- ఆదిత్య కలిసి విలువైన‌ సమయం గడిపారు. వీరిద్దరూ లండన్‌లో చలికాలం చలిని ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఒక‌టి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.

ఈ వారం ప్రారంభంలో లండన్‌లో న్యూ ఇయర్ వేడుక‌ల్ని జ‌రుపుకున్న జంట నాలుగైదు రోజుల పాటు ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌లో షికార్ చేసారు. లండ‌న్ లో ఐస్ స్కేటింగ్ చేస్తూ క‌నిపించారు. ఈ అంద‌మైన జంట‌ డౌన్ జాకెట్, ట్రెంచ్ కోట్లు, ఇతర వెచ్చని దుస్తులలో తలనుండి పాదాల వరకు క‌ప్పుకుని క‌నిపించారు. మంచు- ఐస్ గ‌డ్డ‌ల‌పై స్కేటింగ్ చేస్తూ ఆస్వాధించారు. ఆసక్తికరంగా ముంబై నుంచి బయలుదేరే ముందు వారిద్దరూ కలిసి రాకపోయినప్పటికీ విమానాశ్రయంలో కలిసి క‌నిపించారు. అటుపై నేరుగా ఇంగ్లాండ్ రాజధాని లండ‌న్ నుండి నూతన సంవత్సర వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు ఐస్ స్కేటింగ్ కి సంబంధించిన ఫోటో వైర‌ల్ అయింది.

దిత్య రాయ్ కపూర్ -అనన్య పాండే కూడా కాఫీ విత్ కరణ్ 8 కౌచ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. హోస్ట్ కరణ్ జోహార్ ఆదిత్య‌ను ప్ర‌శ్నించారు. ''కాబట్టి పుకారు వచ్చింది .. మీరు అనన్య పాండేతో డేటింగ్ చేస్తున్నారని అంటున్నాను'' అని అన్నారు. దీనికి ఆదిత్య,''మీ షోలో నన్ను రహస్యాలు అడగవద్దు, నేను మీకు అబద్ధాలు చెప్పను''అని ఆదిత్య అన్నాడు. ''కొన్ని విషయాలు ప్రైవేట్ .. ప్రత్యేకమైనవి .. దానిని అలాగే ఉంచాలి.. '' అని అన్నారు. మొత్తానికి లండ‌న్ లో ప్రేమ‌జంట షికార్లతో అభిమానుల‌కు ఆ ఇద్ద‌రి గురించి మ‌రింత స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది.