Begin typing your search above and press return to search.

90's డైరెక్ట‌ర్‌కి ఆ హీరో హ్యాండిచ్చాడా?

`90`s ఏ మిడిల్ క్లాస్ బ‌యోపిక్‌` సిరీస్‌తో తొలి ప్ర‌య‌త్నంలోనే సంచ‌ల‌న విజ‌యాన్ని ద‌క్కించుకున్నాడు యంగ్ డైరెక్ట‌ర్ ఆదిత్య హాస‌న్‌.

By:  Tupaki Desk   |   15 May 2025 10:56 AM
90s డైరెక్ట‌ర్‌కి ఆ హీరో హ్యాండిచ్చాడా?
X

'90's ఏ మిడిల్ క్లాస్ బ‌యోపిక్‌' సిరీస్‌తో తొలి ప్ర‌య‌త్నంలోనే సంచ‌ల‌న విజ‌యాన్ని ద‌క్కించుకున్నాడు యంగ్ డైరెక్ట‌ర్ ఆదిత్య హాస‌న్‌. ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్‌తో శివాజీకి మంచి గుర్తింపు ల‌భించ‌డ‌మే కాకుండా మ‌ళ్లీ త‌ను సెకండ్ ఇన్నింగ్స్‌ని స‌క్సెస్‌ఫుల్‌గా ప్రారంభించేలా చేసింది. ఇక ద‌ర్శ‌కుడిగా ఆదిత్య‌హాస‌న్‌కు మంచి గుర్తింపుని అందించ‌డ‌మే కాకుండా క్రేజీ ఫిల్మ్ మేక‌ర్స ఆఫ‌ర్లు అందించేలా చేసింది. ఈ సిరీస్ త‌రువాత ఆదిత్య హాస‌న్ మాట‌లు అందించిన 'ప్రేమ‌లు' తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డం తెలిసిందే.

'90's ఏ మిడిల్ క్లాస్ బ‌యోపిక్' క్రేజ్‌తో చాలా మంది హీరోలు ఆదిత్య హాస‌న్‌కు ఆఫ‌ర్లు చేశారట‌. మంచి క‌థ‌తో వ‌స్తే సినిమా చేద్దామ‌ని క‌మిట్‌మెంట్ ఇచ్చారట‌. ఇందులో హీరో నితిన్ కూడా ఉన్నాడని తెలిసింది. వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ డైరెక్ట‌ర్ ఆదిత్య హాస‌న్‌తో సినిమా చేయాల‌ని క‌మిట్ అయ్యాడ‌ని, దీనికి సంబంధించిన వార్త‌లు ఆ మ‌ధ్య షికారు చేశాయి. అయితే నెల‌లు గ‌డుస్తున్నా దానికి సంబంధించిన ఊసే లేదు. నితిన్ రీసెంట్‌గా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్ని ఎదుర్కొన్నాడు.

వెంకీ కుడుముల‌తో చేసిన 'రాబిన్ హుడ్‌' స‌గం వండి వ‌దిలేసిన మూవీగా మారి నిరాశ‌ప‌రిచింది. ఇక అంత‌కు ముందు వ‌క్కంతం వంశీని న‌మ్మి చేసిన 'ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యాన్‌' అయితే డిజాస్ట‌ర్‌ అనిపించుకుని షాక్ ఇచ్చింది. ప్ర‌స్తుతం హిట్టు కోసం నితిన్ చేస్తున్న మూవీ 'త‌మ్ముడు'. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ జూలై 24న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీ త‌రువాత మ‌రో ప్రాజెక్ట్‌ని అంగీక‌రించ‌ని నితిన్ ముందు అనుకున్న‌ట్టుగా ఆదిత్య హాస‌న్‌తో సినిమా చేస్తాడ‌ని అంతా భావించారు. కానీ సీన్ మారింది.

నితిన్ త‌న‌తో ప్రాజెక్ట్ విష‌యంలో సైలెంట్ అయిపోవ‌డంతో చేసేది లేక ఆదిత్య హాస‌న్ మ‌రో హీరోతో సినిమాకు రెడీ అయిపోయాడు. రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌తో సినిమాని ఫైన‌ల్ చేసుకున్నాడు. ఈ మూవీ గురువారం హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది. ఆదిత్య హాస‌న్ త‌ర‌హాలోనే నితిన్ కొంత మంది డైరెక్ట‌ర్లతో సినిమా చేస్తాన‌ని చెప్పి నెల‌ల త‌ర‌బ‌డి వేయిట్ చేయించి చివ‌రికి వేరే డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేశాడ‌ని, అదే ప‌రిస్థితిని ఇన్నాళ్లు ఎదుర్కొన్న ఆదిత్య హాస‌న్ తెలివిగా ప్ర‌వ‌ర్తించి మ‌రో హీరోతో సినిమాని ఫైన‌ల్ చేయించుకున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కామెంట్ చేస్తున్నాయి.