అందరి చూపు ఆదిత్యధర్ డ్రీమ్ ప్రాజెక్టు పైనే.. పూర్తి వివరాలు త్వరలోనే!
బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు ఇప్పుడు ఇండియా వైడ్‌గా మారుమోగిపోతోంది.
By: Madhu Reddy | 25 March 2026 3:10 PM ISTబాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు ఇప్పుడు ఇండియా వైడ్‌గా మారుమోగిపోతోంది. రణవీర్ సింగ్‌తో తీసిన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తుండగానే, ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'ది ఇమ్మోర్టల్ అశ్వథామ'ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. సుమారు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మైథో-సైన్స్ ఫిక్షన్ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్ విశేషాలేంటి? ఇందులో హీరో ఎవరు? ఆ విశేషాలు చూద్దాం..
'ధురంధర్' సక్సెస్‌తో ఆదిత్య ధర్ జోరు:
దర్శకుడు ఆదిత్య ధర్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. 'ఉరి: ద సర్జికల్ స్ట్రైక్' వంటి బ్లాక్ బస్టర్‌తో కెరీర్ మొదలుపెట్టిన ఆయన, ఇటీవల 'ధురంధర్' మూవీతో తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. సినిమా ఎంత సక్సెస్ అయిందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ. 437 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రూ. 500 కోట్ల క్లబ్‌లోకి చేరడానికి సిద్ధంగా ఉంది. వరుస ప్లాపుల్లో ఉన్న రణవీర్ సింగ్‌కు ఈ సినిమా ఒక ఊపిరి పోసిందనే చెప్పాలి. ఈ భారీ విజయంతో ఆదిత్య ధర్ తన కలల ప్రాజెక్ట్ అయిన 'అశ్వథామ'పై మళ్లీ దృష్టి సారించారు.
ఆగిపోయిన ప్రాజెక్ట్.. మళ్ళీ పట్టాలెక్కుతోందా?:
నిజానికి 'ది ఇమ్మోర్టల్ అశ్వథామ' సినిమాను ఆదిత్య ధర్ కొన్ని ఏళ్ల క్రితమే ప్రకటించారు. కానీ అప్పట్లో బడ్జెట్ పరిమితుల వల్ల, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. మహాభారతంలోని అశ్వథామ పాత్రకు అమరత్వాన్ని జోడించి, దాన్ని ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఒక సూపర్ హీరో యాక్షన్ డ్రామాగా మలచాలన్నది ఆయన ప్లాన్. ఇప్పుడు 'ధురంధర్' ఇచ్చిన ధైర్యంతో, మార్కెట్ రేంజ్ పెరగడంతో ఈ భారీ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
1000 కోట్ల బడ్జెట్.. హీరో ఎవరు?:
ఈ సినిమా బడ్జెట్ వింటే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. అక్షరాలా రూ. 800 కోట్ల నుండి రూ. 1000 కోట్ల భారీ వ్యయంతో ఈ పాన్-ఇండియా మూవీ రూపుదిద్దుకోనుంది. ఇంతటి భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. గతంలో విక్కీ కౌశల్ పేరు బలంగా వినిపించింది. ఆ తరువాత ఇంకొంత మంది స్టార్స్ పేర్లు వినిపించాయి ఐతే తాజా సమాచారం ప్రకారం, ఆదిత్య ధర్ తన ఫేవరెట్ హీరో అయిన విక్కీ కౌశల్‌నే మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చినట్లు టాక్. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'ఉరి' మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
భారతీయ పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో కలిపి చెప్పడం అంటే ఒక సాహసమనే చెప్పాలి. హాలీవుడ్ లెవల్ విజువల్స్‌తో, మన చరిత్రలోని ఒక గొప్ప పాత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆదిత్య ధర్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే సినిమా లాంచ్ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని సమాచారం. ఈ సినిమా గనుక వర్కౌట్ అయితే ఇండియన్ సినిమా రేంజ్ ప్రపంచ స్థాయికి వెళ్లడం ఖాయం.
