Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ ను రోజంతా ఆకలితో ఉంచిన స్టార్‌ డైరెక్టర్‌

తెలుగులో చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా హీరోయిన్ అదితి రావు హైదరికి మంచి గుర్తింపు ఉంది

By:  Tupaki Desk   |   3 May 2024 4:30 PM GMT
హీరోయిన్‌ ను రోజంతా ఆకలితో ఉంచిన స్టార్‌ డైరెక్టర్‌
X

తెలుగులో చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా హీరోయిన్ అదితి రావు హైదరికి మంచి గుర్తింపు ఉంది. పైగా తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి అవ్వడంతో పాటు తెలుగు లో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న హీరో సిద్దార్థ్ తో ప్రేమలో ఉంది. వీరిద్దరు దాదాపు మూడేళ్లుగా సహ జీవనం సాగిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

అదితి రావు హైదరి ప్రస్తుతం మోస్ట్‌ అవైటెడ్‌ సంజయ్ లీలా బన్సాలి వెబ్‌ సిరీస్ 'హీరామండీ' లో కీలకమైన వేశ్య పాత్రలో కనిపించబోతుంది. సాధారణంగా హీరోయిన్స్ ఇలాంటి పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపించరు. కానీ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో కనుక ఏ ఒక్కరు ఆ పాత్రను కాదనరు. బన్సాలీ సినిమాలో సెట్‌ ప్రాపర్టీకి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది.

అందుకే బన్సాలి తీస్తున్న ఈ విభిన్న వెబ్‌ సిరీస్‌ లో స్టార్‌ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, అదితి రావు హైదరి, షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్, ఫర్దీన్ ఖాన్‌ లతో పాటు ఇంకా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో అదితి రావు హైదరి మాట్లాడింది.

అదితి మాట్లాడుతూ... హీరామండీ సిరీస్ కోసం తాను ఒక రోజంతా కూడా ఆకలితో ఉండాల్సి వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏమీ తినకుండా ఉండమని దర్శకులు సంజయ్ లీలా బన్సాలీ చెప్పారు. ఒక ఫైర్‌ ఫుల్‌ సీన్ చేయాల్సి ఉంటుంది కనుక దానికోసం ఆకలితో ఉండమని బన్సాలీ చెప్పారు.

రోజంతా వెయిట్‌ చేసిన తర్వాత సాయంత్రం సమయంలో ఆ సీన్ ని షూట్‌ చేశారు. బన్సాలీ సర్ చెప్పినట్లు చేయడం వల్ల ఆ సన్నివేశంలో చాలా ఈజీగా నటించగలిగాను. సాధారణంగా అయితే ఆ సీన్‌ ను చేయడంకు కచ్చితంగా సమయం ఎక్కువ పట్టేది. కానీ ఏమీ తినకుండా చేయడం వల్ల ఆ షాట్ త్వరగా పూర్తి అయ్యింది.

స్క్రీన్‌ పై ఆ సీన్‌ ను చూస్తున్న సమయంలో కచ్చితంగా ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవుతారు అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి నటీనటులు ఒక్క షాట్‌ కోసం లేదా ఒక్క సీన్ కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది అంటూ అదితి వ్యాఖ్యలతో మళ్లీ నిరూపితం అయ్యింది.