Begin typing your search above and press return to search.

డాడీతో అదితీ శంక‌ర్ ఫైటింగ్!

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కుమార్తె అదితి శంక‌ర్ టాలీవుడ్ లోనూ లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. `భైర‌వం` సినిమాతో ఎంట్రీ ఇస్తుంది.

By:  Tupaki Desk   |   13 May 2025 4:30 PM
Aditi Shankar Telugu Debut Carving Her Own Path
X

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కుమార్తె అదితి శంక‌ర్ టాలీవుడ్ లోనూ లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. `భైర‌వం` సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. అమ్మ‌డు కోలీవుడ్ లో లాంచ్ అయిన నాటి నుంచి టాలీవుడ్ లో ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇద్దామా? అని ఎంతో క్యూరియస్ గా ఎదురు చూస్తుంది. శంక‌ర్ కున్న పాన్ ఇండియా ఇమేజ్ తో ఓ పెద్ద చిత్రంతో లాచ్ అవుతుంద‌నుకున్నారు? కానీ అదితి మాత్రం చిన్న‌-పెద్ద అనే తార‌త‌మ్యం లేకుండా వ‌చ్చిన అవ‌కాశాన్నే గొప్ప‌గా భావించి లాంచ్ అవుతుంది.

ఆ ర‌కంగా సినిమాల ప‌ట్ల త‌న‌కెంత ఫ్యాష‌న్ అన్న‌ది మ‌రోసారి ప్రూవ్ చేసుకుంది. సాయి శ్రీనివాస్, మంచు మ‌నోజ్, నారా రోహిత్ హీరోల‌గా న‌టిస్తున్నారు. మ‌రి అదితి ముగ్గురిలో ఎవ‌రికి పెయిర్ గా న‌టిస్తుంద‌న్న‌ది స‌స్పెన్స్. అయితే అదితి ఏ సినిమా చేసినా తండ్రి బ్రాండ్ తో ఛాన్సులందుకోవ‌డంలేదు. త‌న‌కు తానుగా ప్ర‌య‌త్నాలు చేసి అందుకుంటుంది. ఇండ‌స్ట్రీ క‌ష్టాలు ఎలా ఉంటాయో తెలిస్తేనే న‌టిగా స‌క్సెస్ అవుతాం అన్న మాట‌ను అమ్మ‌డు బ‌లంగా న‌మ్ముతుంది.

శంక‌ర్ కూడా త‌న నుంచి ఎలాంటి స‌హ‌కారం ఉండ‌ద‌నే ఎంట్రీకి ముందే చెప్పేసారు. దీంతో అన్నీ తానై అవ‌కాశాలు అందుకుంటుంది. అయితే అవ‌కాశాలు ఇప్పించ‌డంలో డాడ్ స‌హ‌క‌రించ‌క‌పోయినా తాను న‌టించిన ఏ సినిమా అయినా శంక‌ర్ త‌ప్ప‌కుండా చూడాల్సిందేట‌. డాడ్ కి మ‌రో ఆప్ష‌న్ లేద‌ని అదితి తెలిపింది. చూడ‌నంటే డాడ్ తో పైటింగ్ చేస్తుందిట‌. అల‌క‌పానుపు ఎక్కుతుందిట‌.

తాను ఏ సినిమా చేసినా ఆవిష‌యాల‌న్నింట‌ని ముందుగా మామ్ తో చెబుతుందిట‌. డైలీ అప్ డేట్ అంతా మామ్ కే ఇస్తుందిట‌. ఈ విష‌యంలో శంక‌ర్ ఇన్వాల్వ్ కారుట‌. తాను ఏ ప్రాజెక్ట్ చేస్తుంది? అన్న‌ది కూడా శంక‌ర్ కి తెలియ‌దట‌. రిలీజ్ కు వ‌చ్చే స‌రికి డాడీ సినిమా చూడండి అని ఒక్క మాట చెప్పడంతో మ‌రో ర‌కంగా డాడ్ ని ఇబ్బంది పెట్ట‌న‌ని తెలిపింది.