అతిది శంకర్ వద్ద ప్లాన్ బీ!
ఇండస్ట్రీలో స్టార్ డమ్ ఉన్నంత కాలం అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు. ఫాం కోల్పోతే మాత్రం కెరీర్ మునుపటిలా సాగదు.
By: Tupaki Desk | 31 May 2025 4:00 PM ISTఇండస్ట్రీలో స్టార్ డమ్ ఉన్నంత కాలం అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు. ఫాం కోల్పోతే మాత్రం కెరీర్ మునుపటిలా సాగదు. వచ్చిన అవకాశాలతో సరిపెట్టుకోవాలి. అవీ రాకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవాలి. అందుకే హీరోయిన్ల వద్ద ప్లాన్ బీ కూడా సిద్దంగా ఉంటుంది. ఆ ప్లాన్ బీ మంచి బిజినెస్ మ్యాన్ ను చూసుకుని పెళ్లి చేసుకుకోవడం కావొచ్చు. అప్పటికే ఉన్న వ్యాపారాలను వృద్దిలోకి తీసుకొచ్చే ప్రాణళిక కావచ్చు. లేదా ఉన్న చదువును బట్టి మంచి ఉద్యోగంలో చేరడం.
మరి స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ వద్ద ఉన్న ప్లాన్ బీ ఏంటంటే? చదవుని తెలుస్తోంది. అదితి డాక్టరమ్మ అయిన తర్వాత యాక్టరమ్మగా మారింది. శంకర్ కు కుమార్తెను డాక్టర్ గా చూడాలన్నది కోరిక. ఆ మేరకు అతిదిని మంచి యూనివర్శిటీలో డాక్టర్ చదివించారు. చదువుల్లో అదితి చిన్నప్పటి నుంచి చురుకుదనం చూసే శంకర్ కుమార్తె కెరీర్ ని అలా బిల్డ్ చేసాడు.
కానీ శంకర్ లా కుమార్తె సినిమాలు కోరుకోవడంతో శంకర్ ఇష్టం లేకపోయినా తండ్రిని ఒప్పించి సినిమాల్లోకి వచ్చింది. ఎంటర్ అయ్యే ముందు సినిమాల అనంతరం వైద్య వృత్తిని కొనసా గించాలి అనే కండీషన్ శంకర్ పెట్టారు. ఆ తర్వాత సినిమాలకు అనుమిచ్చారు. తన అవకాశాలు తానే కష్టపడి సంపాదించుకోవాలి. తండ్రి నుంచి ఎలాంటి రికమండీషన్లు ఉండవని ముందే చెప్పేసారు శంకర్.
అదితి కూడా తండ్రి పేరు ఎక్కడా వాడకుండానే అవకాశాలు అందుకుంటుంది. 'భైరవం' సినిమాతో తెలుగులోనూ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తమిళ్ లో కొన్ని హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతా నికి అవకాశాల పరంగా పర్వాలేదు. కానీ సినిమాల నుంచి ఎగ్జిట్ అయితే గనుక తండ్రి మాట ప్రకారం డాక్టర్ గా సేవలందిస్తుంది. తన ప్లాన్ బీ డాక్టర్ వృత్తిని రివీల్ చేయడంతోనే సంగతి అర్దమైంది.
