Begin typing your search above and press return to search.

ఆ హీరో ఇష్ట‌మంటున్న శంక‌ర్ కూతురు!

ఈ సినిమాకు మ‌రో అస్సెట్ అవ‌గా, రీసెంట్ గా అదితి త‌న ఫేవ‌రెట్ యాక్ట‌ర్ గా గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పేరు చెప్పి వార్త‌ల్లో నిలిచింది.

By:  Tupaki Desk   |   14 May 2025 1:02 PM
ఆ హీరో ఇష్ట‌మంటున్న శంక‌ర్ కూతురు!
X

ఛ‌త్ర‌ప‌తి బాలీవుడ్ రీమేక్ కోసం త‌న ప్రైమ్ టైమ్ ను మూడేళ్ల పాటూ వేస్ట్ చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ సినిమాతో దారుణ‌మైన ఫ్లాపును అందుకున్నాడు. ప్ర‌స్తుతం శ్రీనివాస్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒక‌టి టైస‌న్ నాయుడు కాగా రెండోది భైర‌వం. ఈ సినిమాలో శ్రీనివాస్ తో పాటూ నారా రోహిత్, మంచు మ‌నోజ్ కూడా న‌టిస్తున్నారు.

నాంది లాంటి గ్రిప్పింగ్ స్టోరీతో మొద‌టి సినిమాతోనే స‌త్తా చాటి ఆడియ‌న్స్ ను మెప్పించిన‌ విజ‌య్ క‌న‌క‌మేడ‌ల భైర‌వం సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. భైర‌వం సినిమాలో ఇంటెన్స్ డ్రామాతో పాటూ ప‌వ‌ర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ లు చూడొచ్చ‌ని క్యాస్టింగ్, పోస్ట‌ర్లు, టీజ‌ర్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా అదితి శంక‌ర్ న‌టిస్తోంది.

అదితి శంక‌ర్ అంటే ఎవ‌రో కాదు, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కూతురు. భైర‌వం సినిమాతో అదితి త‌న వెండితెర అరంగేట్రం చేయ‌డం ఈ సినిమాకు మ‌రో అస్సెట్ అవ‌గా, రీసెంట్ గా అదితి త‌న ఫేవ‌రెట్ యాక్ట‌ర్ గా గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పేరు చెప్పి వార్త‌ల్లో నిలిచింది. అంతేకాదు, తాను థియేట‌ర్లో చూసిన ఫ‌స్ట్ తెలుగు సినిమా మ‌గ‌ధీర అని కూడా అదితి ఈ సంద‌ర్భంగా చెప్పింది.

అదితి తండ్రి శంక‌ర్ రామ్ చ‌ర‌ణ్ తో గేమ్ ఛేంజ‌ర్ అనే భారీ సినిమాను తీసిన విష‌యం తెలిసిందే. కాక‌పోతే ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర డిజాస్ట‌ర్ గా నిలిచింది. రామ్ చ‌ర‌ణ్ కు త‌న కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాపు ను అందించిన డైరెక్ట‌ర్ శంక‌ర్. అలాంటిది ఆయ‌న‌ కూతురు త‌న ఫేవ‌రెట్ యాక్ట‌ర్ గా చ‌ర‌ణ్ పేరు చెప్ప‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అంతేకాదు, ఒక నటుడిగా తాను నానిని ఎంతో ఆరాధిస్తాన‌ని కూడా అదితి తెలిపింది. ఇదిలా ఉంటే అదితి న‌టించిన మొద‌టి సినిమా భైర‌వం మే 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.