Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు ముద్దుల‌తో మొద‌లు పెట్టారా?

ప్రేమ‌కు వ‌య‌సుతో సంబంధం ఉండ‌దంటారు. మ‌న‌సు మాత్ర‌మే ముఖ్యం. ఆ మ‌న‌సు క‌ల్మ‌షం లేకుండా స్వ‌చ్ఛంగా ఉంటే చాలు.

By:  Tupaki Desk   |   6 Jun 2025 10:00 PM IST
ఇద్ద‌రు ముద్దుల‌తో మొద‌లు పెట్టారా?
X

ప్రేమ‌కు వ‌య‌సుతో సంబంధం ఉండ‌దంటారు. మ‌న‌సు మాత్ర‌మే ముఖ్యం. ఆ మ‌న‌సు క‌ల్మ‌షం లేకుండా స్వ‌చ్ఛంగా ఉంటే చాలు. అంత‌క మించి ప్రేమ‌కు ఏం కావాలి. స‌రిగ్గా ఇదే అంశంతో బాలీవుడ్ లో 'ప‌రివారిక్ మ‌నురంజ‌న్' చిత్రం తెర‌కెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ప్రారంభ‌మైంది. ఇందులో అతిదిరావు హైద‌రీ- పంక‌జ్ త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్నారు. అంటే క‌థ ప్ర‌కారం ఇందులో హీరోయిన్ క‌న్నా హీరో చిన్న‌వాడు అని అర్దం.

ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ‌తారు. ఆ ప్రేమ హాస్యం తో కూడిన‌ది. అలాగ‌ని రొమాన్స్ కి ఛాన్స్ లేదు అనుకునేరు. అనుకుంటే పెద్ద పొర‌పాటు జ‌రిగిన‌ట్లే . ఎందుకంటే సినిమా ప్రారంభ‌మే ముద్దుల‌తో ప్రారంభ‌మైంద‌ని స‌మాచారం. అతిది రావు హైద‌రి-పంక‌జ్ త్రిపాఠి కెమెరా ముందు లైవ్ లిప్ లాక్ తోనే తొలి షాట్ ప‌డిందట‌. కామెడీ ప్ర‌ధానంగా సాగే చిత్రం అయినా రొమాంటిక్ స‌న్నివేశాల విష‌యంలో మేక‌ర్స్ ఎక్క‌డా త‌గ్గ‌లేదు.

వ‌రుణ్‌. వి. శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్ర‌మిది. ప‌రివారిక్ మ్యాడ్ నెస్ టైటిల్ తో తెర‌కెక్కుతుంది. మ‌రి ముద్దుల‌తో మొద‌లైన యుద్దం ఎంత దూరం ముగింపు వ‌చ్చే స‌రికి ఇంకెన్ని విధ్వంసాలు జ‌రుగుతాయో. రొమాంటిక్ స‌న్నివేశాల్లో అతిది రావు హైద‌రీ ప్ర‌త్యేక‌త వేరు. హైద‌రాబాద్ బ్యూటీ అయినా అమ్మ‌డు ద‌ర్శ‌కు ల హీరోయిన్. రొమాంటిక్ స‌న్నివేశాల విష‌యంలో ద‌ర్శ‌కుల‌కు క‌ట్టుబ‌డి ప‌ని చేస్తుంది.

బాలీవుడ్ స‌హా తెలుగు చిత్రాల్లోనూ న‌టిగా త‌న మార్క్ వేసింది. అయితే టాలీవుడ్ లో మాత్రం బిజీ న‌టిగా మార‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం ఇత‌ర భాష‌ల్లో ఎక్కువ‌గా సినిమాలు చేస్తోంది. అన్న‌ట్లు ఈ బ్యూటీ న‌టుడు సిద్దార్ధ్ వైఫ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు ప్రేమ వివాహం చేసుకున్నారు.