Begin typing your search above and press return to search.

పెళ్ల‌య్యాక అవ‌కాశాలే క‌రువ‌య్యాయి

త‌న‌కు పెళ్ల‌య్యాక పెద్ద‌గా ఆఫ‌ర్లు రాలేదని, ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో పెళ్లి, పిల్ల‌లు లాంటి మైల్ స్టోన్స్ త‌ర్వాత హీరోయిన్లు రెగ్యుల‌ర్ గా ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ గురించి అదితి మాట్లాడింది.

By:  Tupaki Desk   |   21 Jun 2025 11:00 PM IST
పెళ్ల‌య్యాక అవ‌కాశాలే క‌రువ‌య్యాయి
X

అదితి రావు హైద‌రి పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. స‌మ్మోహ‌నం, చెలియా లాంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కులకు కూడా బాగానే ద‌గ్గ‌రైంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో సినిమాలు చేస్తున్న అదితి రావు హైద‌రి కెరీర్లో ప్ర‌స్తుతం సినీ ఆఫ‌ర్లు క‌రువ‌య్యాయి. ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న అదితి ఇప్పుడు చేతిలో పెద్ద‌గా ఆఫ‌ర్లు లేక ఖాళీగా ఉంటోంది.

గ‌త కొన్నేళ్లుగా సినీ హీరో సిద్ధార్థ్ తో ప్రేమాయ‌ణంను న‌డిపించిన అదితి, గ‌తేడాది అత‌న్ని పెళ్లి చేసుకుని మ‌రోసారి పెళ్లి జీవితంలోకి ఎంట‌రైంది. సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత త‌న కెరీర్ ఎలా ఉందనే విష‌యాన్ని అదితి వెల్ల‌డించింది. రీసెంట్ గా జ‌రిగిన ఓ ఇంట‌రాక్ష‌న్ లో భాగంగా అదితి త‌న కెరీర్ గురించి మాట్లాడి హాట్ టాపిక్ గా మారింది.

త‌న‌కు పెళ్ల‌య్యాక పెద్ద‌గా ఆఫ‌ర్లు రాలేదని, ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో పెళ్లి, పిల్ల‌లు లాంటి మైల్ స్టోన్స్ త‌ర్వాత హీరోయిన్లు రెగ్యుల‌ర్ గా ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ గురించి అదితి మాట్లాడింది. అదితికి అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్, భారీ సంఖ్య‌లో ఫ్యాన్స్ ఉన్న‌ప్ప‌టికీ పెళ్లి త‌ర్వాత త‌న‌కు ఆఫ‌ర్లు రాక‌పోవ‌డ‌మేంట‌ని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

అయితే అదితి అవ‌కాశాల‌పై మాట్లాడ‌టం ఇదేం మొద‌టిసారి కాదు, గ‌తంలో కూడా ఓ సారి అదితి ఈ విష‌యంపై మాట్లాడింది. కాక‌పోతే అప్పుడు హీరామండి సినిమాలో త‌న పాత్ర‌కు వ‌చ్చిన గుర్తింపు చూశాక వ‌రుస అవ‌కాశాలు క్యూ క‌డ‌తాయ‌నుకుంటే అస‌లు ఆఫ‌ర్లే క‌రువ‌య్యాయ‌ని కామెంట్ చేసింది. ఇప్పుడు పెళ్ల‌య్యాక ఆఫ‌ర్లు రావ‌డం లేదంటోంది. ఏదేమైనా ఈ విష‌యంలో అదితి మాట్లాడిన త‌ర్వాత ఇండ‌స్ట్రీలో పెళ్ల‌య్యాక హీరోయిన్ల‌ను చూసే విధానంలో మార్పు రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.