హీరోయిన్ గా మారిన సింగర్!
టాలీవుడ్ ప్రముఖ సింగర్ అదితి భావరాజు ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది.
By: Tupaki Desk | 1 Jun 2025 6:00 PM ISTటాలీవుడ్ ప్రముఖ సింగర్ అదితి భావరాజు ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న దండోరా సినిమాలో అదితి హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. కలర్ ఫోటో, బెదురులంక సినిమాలను నిర్మించిన రవీంద్ర బెనర్జీ దండోరా సినిమాను రూపొందిస్తుండగా ఆ సినిమాతో అదితి భావరాజు హీరోయిన్ గా మారనుంది.
అదితికి టాలీవుడ్ లో సింగర్ గా మంచి గుర్తింపు, పేరు ఉన్నాయి. అదితి గురించి చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాలో జై బాలయ్య సాంగ్ పాడిన సింగర్ గా చెప్తే ఎవరైనా వెంటనే గుర్తు పట్టేస్తారు. అప్పటికే మంచి సింగర్ గా పేరు తెచ్చుకున్న అదితి, జై బాలయ్య సాంగ్ తో మరింత పాపులరైంది. ఆల్రెడీ సింగర్ గా ప్రూవ్ చేసుకున్న అదితి ఇప్పుడు దండోరా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న దండోరా మూవీలో స్ట్రాంగ్ ఎమోషన్స్ తో పాటూ, మంచి కథాంశం, సమాజంలో కొనసాగుతున్న సామాజిక దుష్ప్రవర్తనలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్ మురళీ కాంత్. ఈ సినిమాలో శివాజీ, నందు, రవికృష్ణ, మనికా, మౌనికా రెడ్డి, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.
ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లోని ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్స్ ను మేకర్స్ పూర్తి చేశారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ బీట్ టీజర్ రిలీజవగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి సింగర్ గా ఇప్పటికే సత్తా చాటిన అదితి దండోరాలో హీరోయిన్ గా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
