నటిగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ సింగర్!
టాలీవుడ్ సింగర్లు హీరోయిన్లగా ఎంట్రీ ఇవ్వడం అన్ని చాలా రేర్. చాలా మంది యాక్టింగ్ ను వృత్తిగా ఎంచుకోరు.
By: Tupaki Desk | 31 May 2025 3:00 PM ISTటాలీవుడ్ సింగర్లు హీరోయిన్లగా ఎంట్రీ ఇవ్వడం అన్ని చాలా రేర్. చాలా మంది యాక్టింగ్ ను వృత్తిగా ఎంచుకోరు. గాయకులుగా కొనసాగడానికే ఆసక్తి చూపిస్తుంటారు. కొంత మందికి వెండి తెరపై కనిపిం చాలనే ఆసక్తి ఉన్నా? సాహసించని పరిస్థితుల్లో ఉంటారు. ఈ నేపథ్యంలో తెలుగు సింగర్ అదితి భావరాజు మాత్రం మ్యాకప్ వేసుకోవడానికి రెడీ అయింది. `దండోరా` అనే చిత్రంలో అదితి ఓ కీలక పాత్రకు ఎంపికైంది.
ఆమె ఆసక్తి మేరకు అదితి తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతం నేపథ్యం లో మురళీకాంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బలమైన ప్రేమ కథాంశంతో పాటు కఠినమైన నిజాలను, సమాజంలో కొనసాగుతోన్న సామాజిక దుష్పప్రవర్తలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అదితి భావరాజుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎన్నో చార్ట్ బస్టర్స్ సాంగ్స్ ఆలపించింది.
తనదైన గాత్రంతో శ్రోతల్ని అలరించడం అమ్మడి ప్రత్యేకత. ఆమె వాయిస్ కే ఓ స్పెషాల్టీ ఉంది. బాలకృ ష్ణ కథానాయకుడిగా నటించిన `అఖండ` లోని 'జై బాలయ్య' పాటను ఆమె ఆలపించింది. ఆ పాట సూపర్ హిట్ అయింది. ఇలాంటి బ్యూటీఫుల్ సింగర్ సినిమాకు అదనపు అస్సెట్ గా కలిసొస్తుంది. మరి ఈ సినిమాలో నటిగానే కొనసాగుతుందా? పాటలు కూడా పాడుతుందా? అన్నది తెలియాలి.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై బజ్ మొదలైంది. ఈ సినిమాకు మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని అందుస్తున్నారు. ఆయన సారథ్యంలో అదితి భావరాజు కూడా స్వరం అందుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ప్రస్తుతం అదితి భావరాజు ఫోటోలు సోషల్ మీడి యాలో వైరల్ గా మారాయి.
