Begin typing your search above and press return to search.

లిప్ట్ లో ఇరుక్కుపోతే ముగ్గురు మ‌ధ్య రొమాన్స్!

ఆదిత్య క‌పూర్ ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ ది స్క్రీన్ లో మాంచి రొమాంటిక్ గ‌య్. ఇప్ప‌టికే ఇద్ద‌రు భామ‌ల తో డేటింగ్ లు చేసాడు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 2:30 AM GMT
లిప్ట్ లో ఇరుక్కుపోతే ముగ్గురు మ‌ధ్య రొమాన్స్!
X

ఆదిత్య క‌పూర్ ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ ది స్క్రీన్ లో మాంచి రొమాంటిక్ గ‌య్. ఇప్ప‌టికే ఇద్ద‌రు భామ‌ల తో డేటింగ్ లు చేసాడు. తొలుత శ్ర‌ద్దా క‌పూర్ తో ప్రేమాయ‌ణం పెళ్లివ‌ర‌కూ దారి తీసిన సంగ‌తి తెలిసిందే. ఒకే సినిమాలో న‌టించి ప్రేమ‌లో ప‌డిపోయి ఆ ప్రేమ‌కి వివాహ బంధంతో పుల్ స్టాప్ పెట్టాల‌నుకున్నారు. కానీ చివ‌రి నిమిష‌యంలో అది సాధ్య‌ప‌డ‌లేదు. ప్రేమికులుగా విడిపోయి స్నేహితులుగా క‌లిసి ఉంటున్నారు.

అటుపై ఆదిత్య క‌పూర్ యువ నాయిక లైగ‌ర్ భామ అన‌న్య పాండే తోతే డేటింగ్ మొద‌లు పెట్టాడు. ఇద్ద‌రు ప‌బ్లిక్ గా క‌నిపించిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. ప్రియురాలి బ‌ర్త్ డేని ఎంతో గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసి అమ‌ర ప్రేమికుడయ్యాడు. ఈ విష‌యాన్ని ఇద్ద‌రు అధికారికంగా అంగీక‌రించ‌న‌ప్ప‌టికీ అన‌ధికారంగా వ్య‌వ‌హ‌ర మంతా గుట్టు వీడిందే. వాళ్లిద్ద‌రు స్నేహిత‌ల‌న్నా న‌మ్మే ప‌రిస్థితులు లేవు.

అందుకే ఇలాంటి విష‌యాలు కెల‌క‌డానికే నేను ఉన్నాను అంటూ అప్ప‌డ‌ప్పుడు క‌ర‌ణ్ జోహ‌ర్ తెర‌పైకి వ‌స్తుంటారు. త‌న టాక్ షో కాపీ విత్ క‌ర‌ణ్ లో అన్ని విష‌యాల‌పైనా నిగ్గు తేల్చే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. అర్జున్ క‌పూర్..ఆదిత్య క‌పూర్ ఇద్ద‌రు ఈ షోకి హాజ‌ర‌య్యారు. అన‌న్య పాండే తో డేటింగ్ గురించి క‌ర‌ణ్ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు వేసాడు. అందుకు ఆదిత్య ఇలా అన్నాడు. `న‌న్ను ర‌హ‌స్యాలు అడ‌గొద్దు.

నేను క‌చ్చితంగా అబ‌ద్దాలు చెప్ప‌లేను. ఈ స‌మ‌యంలో క‌ర‌ణ్ త‌న‌దైన శైలి ప్ర‌శ్న వేసాడు. మీ మాజీ ల‌వ‌ర్ శ్ర‌ద్దా క‌పూర్ మీరు.. అన‌న్య పాండే ఒకే లిప్ట్ లో ఇరుక్కుపోతే ఏం చేస్తారు? అని అడిగాడు. దానికి ప‌క్క‌నున్న అర్జున్ క‌పూర్ ముందుకొచ్చి క‌చ్చితంగా రొమాన్స్ చేస్తాడు. కానీ ఎవ‌రితోనూ తెలియ‌దు అని న‌వ్వేసాడు. ఐయామ్ జ‌స్ట్ జోకింగ్ అని ఆత‌ర్వాత స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేసాడు కానీ అందులో సీరియ‌స్ నెస్ క‌నిపించ‌లేదనుకోండి.