Begin typing your search above and press return to search.

బంధుప్రీతితో దొరికిపోయిన టాప్ డైరెక్ట‌ర్

క్వీన్ కంగ‌న ర‌నౌత్ చాలాసార్లు బాలీవుడ్ సిండికేట్ గురించి తీవ్రంగా విమ‌ర్శించారు.

By:  Tupaki Desk   |   5 May 2024 1:30 PM GMT
బంధుప్రీతితో దొరికిపోయిన టాప్ డైరెక్ట‌ర్
X

ఇండ‌స్ట్రీలో బంధుప్రీతి గురించి నిరంత‌రం చ‌ర్చ సాగుతోంది. బాలీవుడ్ లో కొంద‌రు పెద్ద‌లు సినీప‌రిశ్ర‌మ‌లోకి బ‌య‌టి ప్ర‌తిభ‌ను రానివ్వ‌కుండా అణ‌గ‌దొక్కుతున్నార‌ని, కుటుంబ సభ్యులు లేదా త‌మ వారికి మాత్ర‌మే అవ‌కాశాలిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విష‌యంలో కుట్ర గురించి ప్ర‌జ‌ల‌కు తెలిసిన‌దే. క్వీన్ కంగ‌న ర‌నౌత్ చాలాసార్లు బాలీవుడ్ సిండికేట్ గురించి తీవ్రంగా విమ‌ర్శించారు.


ఇక ఇదే సిండికేట్ పెద్ద‌ల్లో భ‌న్సాలీ ఉన్నార‌ని కూడా కంగ‌న లాంటి భామ‌లు విమ‌ర్శించారు. బంధుప్రీతికి సంజ‌య్ లీలా భ‌న్సాలీ అంత‌టివాడు అతీతుడేమీ కాద‌ని ఇప్పుడు మ‌రోసారి విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి. క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు భ‌న్సాలీ తెర‌కెక్కించిన నెట్ ఫ్లిక్స్ సిరీస్ హీరామండిలో త‌న‌వారికి అత‌డు అవ‌కాశం క‌ల్పించాడు. కానీ ఆ పాత్ర అంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. అంత‌గా ఎక్స్ ప్రెష‌న్స్ ప‌లికించ‌లేని న‌టికి అవ‌కాశం క‌ల్పించాడ‌ని భ‌న్సాలీ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు.

ఇటీవ‌ల‌ విడుదలైన నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌- హీరామండిలో అతడి మేనకోడలు షర్మిన్ సెగల్ ని ఒక కీల‌క పాత్ర‌కు ఎంపిక చేసాడు భ‌న్సాలీ. ఇది మరోసారి బంధుప్రీతి గురించిన‌ చర్చకు దారితీసింది. మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, శేఖర్ సుమన్, అదితి రావ్ హైదరీ వంటి ప్రశంసలు పొందిన నటీనటుల మ‌ధ్య ఆమె తేలిపోయిందని విమ‌ర్శ‌లొస్తున్నాయి.

ఈ సిరీస్‌లో బెల్లా భ‌న్సాలీ సెగల్ - దీపక్ సెగల్ దంప‌తుల‌ కుమార్తె షర్మిన్ కీల‌క‌మైన‌ అలంజేబ్ పాత్రను పోషించారు. కానీ ఈ సిరీస్ లో మనీషా, సోనాక్షి, అదితి ఘనమైన ప్రదర్శనలకు ప్ర‌శంస‌లు కురుస్తుండ‌గా ష‌ర్మిన్ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. వెబ్ షో అంతటా అదే (ఒక‌టే) ఎక్స్‌ప్రెష‌న్ ..అంటూ విమర్శలను ఎదుర్కొంటున్నారు. బంధుప్రీతి వల్ల ఆమెకు ఈ పాత్ర వచ్చింది అని ఇంటర్నెట్‌లోని ఒక విభాగం కామెంట్ల‌తో విరుచుకుప‌డుతోంది. హీరామాండి లాస్ ఏంజిల్స్ ప్రీమియర్‌లో సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పోజులిచ్చిన ఫోటోను షేర్ చేస్తూ ష‌ర్మిన్ పై నెటిజ‌నులు ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తనకు వస్తున్న ప్రతికూల కామెంట్ల‌ న‌డుమ‌... ష‌ర్మిన్ తాజా పోస్ట్‌పై కామెంట్ల సెక్ష‌న్ ని నిలిపివేసింది.

షర్మిన్ 2019లో భన్సాలీ నిర్మించిన `మలాల్`లో తొలిసారిగా నటించింది. ఈ చిత్రంలో మీజాన్ జాఫ్రీతో కలిసి నటించింది. గోలియోన్ కి రాస్‌లీలా రామ్-లీలా, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి కతియావాడి వంటి ప్రాజెక్టులకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా భన్సాలీతో కలిసి పనిచేసిన షర్మిన్ హారర్ కామెడీ `అతిథి భూతోభవ`లో నటించారు.

భ‌న్సాలీది చిన్న పిల్లాడి స్వ‌భావం.. ఎల్లప్పుడూ షార్ట్ టెంపర్‌గా ఉండే పర్ఫెక్షనిస్ట్‌! అని హీరామాండి నటుడు శేఖర్ సుమన్ అంటుంటారు. అయితే భ‌న్సాలీ అంటే అంద‌రికీ గౌర‌వం. అత‌డి కోసం రెండు మూడు అద‌న‌పు ప‌ని గంట‌లు ప‌ని చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తార‌ని మేన‌కోడ‌లు ష‌ర్మిన్ అన్నారు.