Begin typing your search above and press return to search.

హనుమాన్ పాఠం.. 1000 కోట్ల బ్యాడ్ లక్

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ప్రస్తుతం మైథాలజీ టచ్ ఉన్న కథలకి ఫుల్ డిమాండ్ ఉంది

By:  Tupaki Desk   |   22 Jan 2024 5:34 AM GMT
హనుమాన్ పాఠం.. 1000 కోట్ల బ్యాడ్ లక్
X

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ప్రస్తుతం మైథాలజీ టచ్ ఉన్న కథలకి ఫుల్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా హిందూ మైథాలజీ, కల్చర్ మూలాలని బలంగా రిప్రజెంట్ చేసే కథలకి ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్నారు. కార్తికేయ 2, కాంతార, హనుమాన్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలలో మైథాలజీ రిఫరెన్స్ తో పాటు మన భారతీయ సనాతన సాంస్కృతి మూలాలని గొప్పగా ఆవిష్కరించారు.

ఈ కారణంగా ఈ మూవీస్ అన్ని కూడా ఇండియన్ వైడ్ గా మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఒక్క ఆర్ఆర్ఆర్ తప్ప మిగిలిన మూడు కనీసం స్టార్ క్యాస్టింగ్ కూడా లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయి. నార్త్ ఇండియాలో కూడా వీటికి అద్భుతమైన ఆదరణ లభించింది. ఈ మూవీస్ సక్సెస్ తర్వాత చాలా మంది మైథాలజీని అడాప్ట్ చేసుకొని కథలు సిద్ధం చేసుకోవడం మొదలు పెడుతున్నారు.

అయితే ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ మూవీ మాత్రం డిజాస్టర్ అయ్యింది. నిజానికి అది రామాయణం ఇతిహాసం కథతోనే తెరకెక్కించారు. అయితే హాలీవుడ్ స్టాండర్డ్స్ అంటూ రైటర్, డైరెక్టర్ హిందువులు పవిత్రంగా భావించే రామాయణంలో వారికి నచ్చిన విధంగా లేని అంశాలని చేర్చి తెరపై ఆవిష్కరించారని కామెంట్స్ వచ్చాయి. అయిన కూడా సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

రామాయణం చూస్తామని వెళ్లిన ఆడియన్స్ కి ఆదిపురుష్ పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యింది. దానికి కారణం వక్రీకరణ అని సినీ విశ్లేషకులు స్పష్టం చేశారు. హిందూ సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కోర్టులు జోక్యం చేసుకొని దర్శకుడిపై విమర్శలు చేసింది. నిజానికి రామాయణంలో ఉన్న ఒరిజినాలిటీ మార్చకుండా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించి ఉంటే కచ్చితంగా ఆదిపురుష్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకునేదని హనుమాన్ మూవీ చూసిన తర్వాత ఆడియన్స్ నుంచి వినిపిస్తోన్న మాట.

వందల కోట్ల బడ్జెట్ పెట్టిన కూడా నాసిరకమైన గ్రాఫిక్స్ ఆదిపురుష్ లో ఉన్నాయి. కనీసం శ్రీరాముడి పాత్రని కూడా నేచురల్ గా ఎలివేట్ చేయలేదు. తెరపై గ్రాఫిక్స్ బొమ్మలు చూసిన ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగింది. అంతగా ఆదిపురుష్ సినిమాతో ఓం రౌత్ టీమ్ డిజప్పాయింట్ చేసింది. ఈ కారణంగానే ప్రతిసారి ట్రోల్స్ కి గురవుతున్నారు. నిజంగా మైథాలజీని కరెక్ట్ గా అర్ధం చేసుకొని అందులోని భావాన్ని, మూలాల్ని మార్చకుండా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తే ఆదిపురుష్ ఒక అద్భుతమైన మూవీ అయ్యుండేది అనే మాట వినిపిస్తోంది.