Begin typing your search above and press return to search.

మంచులక్ష్మి ఆదిపర్వం.. మరో గ్రాఫిక్స్ కథ

మంచు లక్ష్మి నటిగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 Feb 2024 10:58 AM GMT
మంచులక్ష్మి ఆదిపర్వం.. మరో గ్రాఫిక్స్ కథ
X

మంచు లక్ష్మి నటిగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అనగనగా ఒక ధీరుడు సినిమాతో మంచు లక్ష్మి విలనీగా తెరంగేట్రం చేసింది. తరువాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఫీమేల్ సెంట్రిక్ కథలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతం ఆదిపర్వం అనే సినిమాలో మంచులక్ష్మి నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.


భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ బేస్ చేసుకొని ఈ మూవీ కథ ఉంటుందంట. అన్వికా ఆర్ట్స్ మరియు ఎ. వన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సిద్ధం అవుతోన్న ఈ సినిమాకి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకంగా ఐదు ఇండియన్ భాషలలో ఈ మూవీ సిద్ధం అవుతోంది. 1974 నుంచి 1992 నేపథ్యంలో పీరియాడికల్ జోనర్ లో ఈ కథ నడుస్తుందంట. నాగులపురం నాగమ్మ పాత్రలో ఆమె కనిపించనుంది.

అనగనగా ఒక ధీరుడు సినిమా తర్వాత ఆ స్థాయిలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఆదిపర్వం మూవీ ఉంటుందంట. ఇక ఈ సినిమాలో మంచు లక్ష్మి ఎంత పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని చేసిందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత గంటా శ్రీనివాసరావు తెలిపారు. గ్రాఫిక్స్ వర్క్ ప్రస్తుతం జరుగుతున్నాయని, త్వరలోనే మంచి డేట్ ని చూసుకొని మూవీని థియేటర్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. సినిమాలో క్షేత్ర పాలకుడు పాత్రలో శివ కంఠంనేని కనిపించనున్నారని తెలిపారు.

ఇటీవల వచ్చిన హనుమాన్ తరహాలోనే ఆదిపర్వం మూవీ కూడా హై స్టాండర్డ్స్ లో ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకి మాధవ్ సైబా - సంజీవ్ మేగోటి, బి. సుల్తాన్ వలి, ఓపెన్ బనానా, లుబెక్ లీ మార్విన్ సంగీతం అందిస్తున్నారు. మూవీలో ఆదిత్యం ఓం, ఎస్తర్ నొరోన్హా, శ్రీజిత్ ఘోష్, సత్యప్రకాష్, సమ్మెట గాంధీ లాంటి నటీనటులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

మంచు లక్ష్మి చివరిగా తెలుగులో పిట్టకథలు మూవీలో నటించింది. అలాగే మలయాళంలో మోహన్ లాల్ మోనిస్టర్ సినిమాలో విలన్ గా నటించింది. మూవీలో మోహన్ లాల్ తో ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా మంచు లక్ష్మికి ఉంది. మళ్ళీ అలాంటి పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఆదిపర్వం సినిమాలో ఉంటాయంట.