Begin typing your search above and press return to search.

ఆదికేశవ.. ఆ భయానికి వెనుకడుగు!

ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ ఎక్కువగా కొనసాగుతూ ఉండడంతో అనవసరంగా మంచి కంటెంట్ ఉన్న సినిమాతో రిస్క్ చేయడం ఎందుకు అనే ఆలోచనతో డేట్ మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   1 Nov 2023 8:28 AM GMT
ఆదికేశవ.. ఆ భయానికి వెనుకడుగు!
X

మెగా హీరో వైష్ణవ తేజ్ లేటెస్ట్ మూవీ ఆదికేశవ విడుదలపై చాలా రోజులుగాని సస్పెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా రెండుమూడుసార్లు వాయిదా పడింది. అయితే మొత్తానికి నవంబర్ 10వ తేదీన సినిమాను విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు అనుకున్న టైం లో మళ్ళీ డేట్ మార్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చ్యూన్ ఫోర్ సినిమా శ్రీకర స్టూడియోస్ లో ఈ సినిమాను నాగ వంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.


ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ లో వైష్ణవ్ తేజ్ మాస్ యాంగిల్ లో సరికొత్తగా కనిపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే మొత్తానికి విడుదలకు టైమ్ దగ్గర పడుతున్న తరుణంలో మళ్లీ వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిపోయింది.

అందుకు గల కారణాన్ని కూడా నిర్మాత తెలియజేశారు. ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ ఎక్కువగా కొనసాగుతూ ఉండడంతో అనవసరంగా మంచి కంటెంట్ ఉన్న సినిమాతో రిస్క్ చేయడం ఎందుకు అనే ఆలోచనతో డేట్ మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. మళ్ళీ కంటెంట్ విషయంలో ఎవరు కూడా తప్పుడు ప్రచారాలు చేయకూడదు అని డైరెక్ట్ గా క్లారిటీ ఇస్తున్నాము అని తెలియజేశారు.

ఇక సరికొత్తగా ఆదికేశవ సినిమాను నవంబర్ 24వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. ఒక విధంగా ఆదికేశవ సినిమాకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఒకవైపు వరల్డ్ కప్ మ్యాచ్ తో పాటు మరొకవైపు కార్తీ జపాన్ సినిమా సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా ఒకేసారి పోటీల్లో నిలబడటంతో ఆ ఫైట్ లో వెళితే ఏ సినిమాకైనా కాస్త ప్రమాదమని చెప్పాలి.

ఇక నిర్మాత నాగ వంశీ అన్ని విషయాల గురించి ఆలోచించి ఆదికేశవ సినిమాను సేఫ్ గా మరొక డేట్ కు మార్చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలు పడాల్సిన అవసరం లేదు అని కంటెంట్ మీద చాలా నమ్మకంగా ఉన్నామని కూడా ఆయన వివరణ ఇచ్చారు. అంతేకాకుండా హీరో వైష్ణవ తేజ్ ఈ సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా సరికొత్తగా కనిపించబోతున్నాడు అని మంచి సినిమా చూస్తారు అని కూడా తెలియజేశారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కు జోడిగా శ్రీలీల నటించిన విషయం తెలిసిందే.