తెలుగు నటుడు మరో జాక్‌పాట్
దీంతో ఆది పినిశెట్టిని దర్శకనిర్మాతలు ఆ కీలక పాత్ర కోసం ఫైనల్ చేసారు. కార్తీ వా వాతియార్ -సర్దార్ 2 చిత్రాల షూటింగ్ పూర్తి చేశారు.
By: Tupaki Desk | 24 Aug 2025 8:15 AM IST`రంగస్థలం`లో సిట్టిబాబు(చరణ్) సోదరుడిగా ఆది పినిశెట్టి నటనను అంత తేలిగ్గా మర్చిపోలేం. `గుండెల్లో గోదారి` సహా వరుస సినిమాల్లో ఆది పినిశెట్టి నటుడిగా తనను తాను ఆవిష్కరించుకున్నాడు. కోలీవుడ్ లో హీరోగా రాణిస్తూనే, పలు చిత్రాల్లో విలన్‌గా నటించి మెప్పించాడు. రియల్ ఛాలెంజర్ గా అతడు తనను తాను నిరూపించుకుంటున్నాడు.
ప్రతి సినిమాతో కొత్తదనం కోసం తపించే నటుడిగా ఆది పినిశెట్టికి మంచి పేరుంది. నటుడిగా వైవిధ్యం అతడికి అరుదైన అవకాశాల్ని తెచ్చిపెడుతోంది. ఇప్పుడు కార్తీ నటిస్తున్న మార్షల్ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ గా అవకావం దక్కించుకున్నారు. మలయాళ హీరో నివిని పౌళి ఈ పాత్రలో నటించాల్సి ఉండగా చివరి నిమిషంలో అతడు తప్పుకున్నాడు.
దీంతో ఆది పినిశెట్టిని దర్శకనిర్మాతలు ఆ కీలక పాత్ర కోసం ఫైనల్ చేసారు. కార్తీ వా వాతియార్ -సర్దార్ 2 చిత్రాల షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం తానక్కారన్ ఫేం తమిజ్ దర్శకత్వంలో మార్షల్ కోసం సర్వసన్నాహకాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆది పినిశెట్టి లాంటి ప్రతిభావంతుడైన నటుడు అతడికి తోడవ్వడంతో మార్షల్ కి అది పెద్ద ప్లస్ కానుందని అంచనా వేస్తున్నారు. కార్తీ వర్సెస్ ఆది ఎపిసోడ్స్ రక్తి కట్టించేలా తెరకెక్కనున్నాయని తెలిసింది.
మార్షల్ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తారు. కార్తీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పీరియాడికల్ చిత్రమిదని చెబుతున్నారు. తమిళం- తెలుగు ద్విభాషా చిత్రంగా రూపొందించి, పాన్ ఇండియాలోను ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయిక. జయరామ్ మరో కీలక పాత్రధారి. ఇతర నటీనటుల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
