Begin typing your search above and press return to search.

ఆదిపురుష్.. బుల్లితెరపై హిట్టు బొమ్మ

ఈ మధ్యకాలంలో టీవీలలో వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యి అత్యధిక రేటింగ్స్ ని ఆదిపురుష్ మూవీ సొంతం చేసుకోవడం విశేషం.

By:  Tupaki Desk   |   9 Nov 2023 10:08 AM GMT
ఆదిపురుష్.. బుల్లితెరపై హిట్టు బొమ్మ
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కి డిజాస్టర్ అయిన మూవీ ఆదిపురుష్. భారీ బడ్జెట్ తో టి-సిరీస్ ఈ సినిమాని నిర్మించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ మూడు వందల కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. అయితే బ్రేక్ ఈవెన్ మాత్రం అందుకోలేకపోయింది. ఒటీటీ రైట్స్ ద్వారా మంచి ధర రావడంతో నిర్మాత మాత్రం సేఫ్ అయ్యారు. అయితే డిస్టిబ్యూటర్స్ మాత్రం భాగా లాస్ అయ్యారు.

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన మూవీ ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ ని పూర్తిగా నిరాశపరిచింది. రామాయణంలోని పాత్రల చిత్రణ పూర్తిగా వక్రీకరించారని హిందుత్వ సంఘాల నుంచి ఆదిపురుష్ సినిమాపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఆదిపురుష్ మూవీ కథ ఉందనే విమర్శలు వచ్చాయి. శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ ని ఆడియన్స్ కూడా యాక్సప్ట్ చేయలేకపోయారు.

ఇదిలా ఉంటే ఓటీటీలో ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. అయితే రీసెంట్ గా ఈ మూవీ తెలుగు వెర్షన్ టీవీలో వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యింది. బుల్లితెరపై ఆదిపురుష్ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అర్బన్, రూరల్ ఏరియాలలో 8.41 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. పట్టణ ప్రాంతాలలో 9.47 టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం.

ఈ మధ్యకాలంలో టీవీలలో వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యి అత్యధిక రేటింగ్స్ ని ఆదిపురుష్ మూవీ సొంతం చేసుకోవడం విశేషం. దీనిని బట్టి బుల్లితెరపై ఆదిపురుష్ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే. ఈ ఏడాదిలో టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలైన వాల్తేర్ వీరయ్య కి 5.14 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. వీరసింహారెడ్డి మూవీ 8.83 టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుంది.

ఈ రెండు సినిమాలతో పోల్చుకుంటే ఆదిపురుష్ కి బెస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చిందని చెప్పొచ్చు. పౌరాణిక కథాంశంతో తెరకెక్కిన సినిమా కావడంతోనే ఆదిపురుష్ చిత్రానికి బ్లాక్ బస్టర్ రేటింగ్ వచ్చిందనే మాట వినిపిస్తోంది. దానికి తోడు డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ కూడా సినిమాని ఎక్కువ మంది వీక్షించడానికి ఒక కారణం అని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.