Begin typing your search above and press return to search.

AK 47లో అసలు కథ ఇంటర్వెల్ తర్వాతే!

తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన కాంబినేషన్లు ఎప్పుడూ ప్రత్యేకమైన అంచనాలను తీసుకువస్తాయి.

By:  Srikanth Kontham   |   6 March 2026 3:53 PM IST
AK 47లో అసలు కథ ఇంటర్వెల్ తర్వాతే!
X

తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన కాంబినేషన్లు ఎప్పుడూ ప్రత్యేకమైన అంచనాలను తీసుకువస్తాయి. అలాంటి కాంబినేషన్లలో ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తున్నది డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో వెంకటేష్ కలయిక. ఇప్పటికే పలుమార్లు రచయితగా వెంకటేష్ సినిమాలకు పని చేసిన త్రివిక్రమ్, దర్శకుడిగా మాత్రం ఆయనతో ఇప్పటివరకు సినిమా చేసింది లేదు. అందుకే ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ మంచి ఆసక్తి నెలకొంది.

ఈ మూవీకి ఆదర్శ కుటుంబం ఏకే47 అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. టైటిల్ వినగానే ఇదొక సాధారణ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనిపించినా, త్రివిక్రమ్ ఈ కథను పూర్తిగా భిన్నమైన శైలిలో ప్రెజెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది. కథ నిర్మాణంలో ప్రత్యేకమైన ట్విస్టులతో ఆడియ‌న్స్‌ను ఆకట్టుకునేలా ఆయన ప్లాన్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ముందుగా ప్లాన్ చేసిన ప్రకారమే ఎలాంటి ఆలస్యం లేకుండా సాగుతున్నట్టు సమాచారం. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమ్మర్ నుంచి సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఆద‌ర్శ కుటుంబం కథ విషయానికి వస్తే, త్రివిక్రమ్ ఈ క‌థ‌ను రెండు విభిన్న టోన్లలో తీసుకెళ్తున్నట్టు సమాచారం. మొదటి భాగం మొత్తం ఫ్యామిలీ ఎమోష‌న్స్, సరదా సంభాషణలతో నిండిన ఫ్యామిలీ డ్రామాగా సాగుతుందని అంటున్నారు. అయితే ఇంటర్వెల్ వద్ద వచ్చే భారీ ట్విస్టు కథ దిశనే మార్చేస్తుందని, ఆ తరువాత సినిమా యాక్షన్ మోడ్‌లోకి వెళ్లేలా ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు యాక్షన్ ఎలిమెంట్స్ జోడించడం త్రివిక్రమ్ స్టైల్‌లోనే ప్రత్యేకంగా ఉండబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక ఈ మూవీలో హీరోయిన్ గా న‌టిస్తున్న శ్రీనిధి శెట్టి కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఆమెకు వచ్చిన క్రేజ్ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్‌కు మరింత హైప్ ఏర్పడింది. మరోవైపు త్రివిక్రమ్ రాసే డైలాగ్స్, వెంకీ నోట వింటే అదెలా ఉంటుంద‌నే ఎగ్జైట్‌మెంట్ కూడా ఆడియ‌న్స్ లో క‌నిపిస్తోంది. అంతేకాదు, త‌న గ‌త సినిమా గుంటూరు కారంకు వ‌చ్చిన మిక్డ్స్ రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆయ‌న ఈ సినిమాను చాలా ప్రిస్టీజియ‌స్ గా తీసుకుని తెర‌కెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు త్రివిక్ర‌మ్ త‌ర్వాత సినిమా అయిన గాడ్ ఆఫ్ వార్ ను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఏకే47 రిజ‌ల్ట్ కీల‌క‌మైంది. ఈ సినిమా సూప‌ర్ హిట్ అయితే ఆ ప్రాజెక్టుకు మంచి బూస్ట‌ప్ గా మారే అవ‌కాశ‌ముంది.

హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పై కూడా అంద‌రికీ మంచి అంచ‌నాలున్నాయి. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ బీజీఎంకు ప్రత్యేక గుర్తింపు ఉండ‌టంతో ఈ సినిమాకు మ్యూజిక్ కూడా ప్ర‌ధాన బ‌లం కావ‌చ్చ‌ని అంద‌రూ భావిస్తున్నారు. మొత్తానికి కుటుంబ కథా నేపథ్యాన్ని యాక్షన్ ఎలిమెంట్స్‌తో మేళవిస్తూ త్రివిక్రమ్ కొత్త ప్రయోగం చేయబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.