Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ మూవీ ఛాన్స్ కొట్టేసిన ముదురు బ్యూటీ

ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్‌ వెబ్ సిరీస్‌ లకు సైన్ చేసిన జెనీలియా ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ ఆమీర్ ఖాన్‌ హీరోగా నటించబోతున్న సినిమా లో హీరోయిన్ గా ఎంపిక అయింది.

By:  Tupaki Desk   |   13 Oct 2023 5:29 AM GMT
సూపర్ స్టార్‌ మూవీ ఛాన్స్ కొట్టేసిన ముదురు బ్యూటీ
X

జెనీలియా అంటే ఇంకా కూడా తెలుగు ప్రేక్షకులకు బొమ్మరిల్లు సినిమా గుర్తుకు వస్తుంది. ఈ జెనరేషన్‌ ప్రేక్షకులకు బొమ్మరిల్లు రేంజ్ ఏంటి.. ఆ సినిమా లో జెనీలియా ఏంటి పెద్దగా తెలియక పోవచ్చు. కానీ 1980 మరియు 1990 కిడ్స్ కి బొమ్మరిల్లు సినిమా అప్పట్లో ఒక సెన్షేషన్‌... ఒక పాఠం లా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే జెనీలియా ఇంకా బొమ్మరిల్లు బ్యూటీనే అని పిలిపించుకుంటుంది.

జెనీలియా టాలీవుడ్‌ తో పాటు బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే పెళ్లి, పిల్లల తర్వాత జెనీలియా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. పిల్లలు పెద్ద వారు అవ్వడంతో పాటు సినిమాలపై ఆసక్తి అలాగే ఉండటంతో జెనీలియా రీ ఎంట్రీ ఇచ్చింది. మజిలీ రీమేక్‌ లో తన భర్త రితేష్‌ తో కలిసి వేద్‌ అంటూ నటించి మెప్పించిన విషయం తెల్సిందే.

వేద్‌ మూవీ హిట్‌ తో జెనీలియాకు మళ్లీ వరుస సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్‌ వెబ్ సిరీస్‌ లకు సైన్ చేసిన జెనీలియా ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ ఆమీర్ ఖాన్‌ హీరోగా నటించబోతున్న సినిమా లో హీరోయిన్ గా ఎంపిక అయింది. ఆమీర్ ఖాన్‌ హీరోగా ఆర్‌ ఎస్ ప్రసన్న దర్శకత్వం లో సితారే జమీన్‌ పర్‌ అనే సినిమా రాబోతుంది. ఆ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా ఎంపిక అయింది.

జెనీలియా కు ఈ వయసు లో సూపర్‌ స్టార్‌ ఆమీర్ ఖాన్‌ సినిమా లో నటించే అవకాశం రావడం తో అంతా కూడా అవాక్కవుతున్నారు. సూపర్‌ స్టార్‌ ఆమీర్ ఖాన్ తో చేయబోతున్న సినిమా కనుక సూపర్‌ హిట్ అయితే జెనీలియా మళ్లీ బిజీ అవ్వడం ఖాయం.. అది కూడా స్టార్‌ హీరోల సినిమాలతో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ముదురు బ్యూటీకి సూపర్‌ స్టార్‌ ఛాన్స్ ఇవ్వడం గొప్ప విషయం అన్నట్లుగా ఫ్యాన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.